బోనులో చిక్కిన చిరుతను మళ్లీ అడవుల్లో వదిలేశారు

బోనులో చిక్కిన చిరుతను మళ్లీ అడవుల్లో వదిలేశారు

తిరుమలలో ఐదేళ్ల చిన్నారిపై దాడి చేసిన పులిని పట్టుకున్న అధికారులు  తిరిగి శేషాచల ఆడవుల్లోకి వదిలేశారు. పులిని బంధించిన ప్రాంతం నుండి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో బాకరాపేట అటవీ ప్రాంతంలోని పులిగుండు ఏరియాలో చిరుత పులిని  వదిలేశారు.

జూన్ 22న రాత్రి తిరుమల - అలిపిరి నడక దారిలో  కౌశిక్ అనే ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. తీవ్ర గాయాలైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జూన్ 23న సాయంత్రం రెండు బోనులు, 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో  అలిపిరిలోని 7వ మైలు దగ్గర రాత్రి పులి బోనులో చిక్కింది. ఈ చిరుతకు ఏడాదిన్నర వయసు ఉంటుందన్నారు.  పట్టుకున్న చిరుతను  ఇవాళ జూన్ 25న మళ్లీ  శేషాచల అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశారు.