మలక్‌పేట, వెలుగు: సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆటో డ్రైవర్‌ను నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సైదాబాద్‌కు చెందిన ఫసి అహ్మద్ ఆమెర్ అలియాస్ చోర్ ఆమెర్(37) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సంధ్యా తండాకు చెందిన సుమన్(22) ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆమెర్ రెండేళ్ల క్రితం సుమన్ వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు అడిగినప్పుడల్లా బదిరింపులకు దిగాడు. దీంతో మంగళవారం సింగరేణి కాలనీలో సుమన్ కొబ్బరిబోండాల కత్తితో ఆమెర్‌ను విచక్షణారహితంగా నరికేశాడు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు
. నిందితుడు సుమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
