V6 News

ఓరి దేవుడా: ఎండ వేడికి ఆటో అద్దాలు పగిలిపోతున్నాయి..!

ఓరి దేవుడా: ఎండ వేడికి ఆటో అద్దాలు పగిలిపోతున్నాయి..!

ఎండాకాలం వచ్చిందంటే మాడు పగిలే ఎండలు, తీవ్రమైన వేడిమికి విస్తుపోయే ఘటనలు చూస్తుంటాం..అధిక ఉష్ణోగ్రతలకు కొన్నికొన్ని చోట్లు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలు తగలబడుతుంటాయి. ఇవి మనం తరుచుగా వినే న్యూసే.. ఇంకా రోడ్లపై ఆమ్లెట్ వేయడం, ప్లాస్టిక్ కవర్స్ తగలబడిపోవడం వంటి ఎండ వేడి తీవ్రతను చూపే సంఘటనలూ చూస్తుంటాం.. అయితే కేరళలో ఓ  విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఎండలో పార్క్ చేసిన ఓ ఆటో రిక్షా అద్దాలు అధిక వేడితో భల్లున పగిలిపోయాయి. వివరాల్లోకి వెళితే..

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో  విపరీతమై ఎండలతో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న ఓ ఆటోరిక్షా అద్దం వేడికి ఒక్కసారిగా ముక్కలై పోవడం ఆందోళనకు గురి చేసింది. పాలక్కాడ్‌లోని మన్నార్‌క్కాడ్‌లో కోర్టు భవనం దగ్గర పార్క్ చేసి ఉన్న ఆటోరిక్షా ముందు భాగంలోని అద్దం తీవ్రమైన వేడికి ముక్కలైంది. దీంతో ఆటో ఉన్న డ్రైవర్ జంషీర్ కాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పాలక్కాడ్ జిల్లాలో నమోదు అవుతున్నఅత్యధిక ఉష్ణోగ్రతలకు అద్దం పడుతోంది. 

►ALSO READ | మహిళలు బైక్‌పై ఒక పక్కకే ఎందుకు కూర్చుంటారు ? దీని వెనుక అసలు కారణాలు ఇవే..

కేరళ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కొనసాగుతుండటంతో దాదాపు 12 జిల్లాల్లో హెచ్చరికలు చేసింది అక్కడి ప్రభుత్వం.   పాలక్కాడ్ , కొట్టాయం, అలప్పుజ, పతనంతిట్ట, ఎర్నరాకుళం, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.