అవతార్ 2 తెలుగు వర్షెన్ కు డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్

అవతార్ 2 తెలుగు వర్షెన్ కు డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్

‘అవతార్’ ఒక విజువల్ వండర్. పదమూడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాతో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు జేమ్స్ కామెరూన్.  వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వివిధ భాషల్లో విడుదలై బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీకి  సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘అవతార్2’ వస్తోంది. ‘ద వే ఆఫ్ వాటర్’ పేరుతో  డిసెంబర్ 16న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.

రీజనల్ లాంగ్వేజ్‌ డబ్బింగ్ విషయంలో స్పెషల్‌ కేర్ తీసుకున్నారు ‘అవతార్‌‌’ టీమ్.  తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌తో    డైలాగ్స్ రాయించారు. అతని రైటింగ్ స్టైల్ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. తన మార్క్ డైలాగులతో ‘అవతార్ 2’ తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం  నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ సినిమా రూపొందిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్.