ఓటీటీలోకి వచ్చేస్తున్న అవతార్ 2

ఓటీటీలోకి వచ్చేస్తున్న  అవతార్ 2

అవతార్.. ఈ పేరు వింటే చాలు.. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉబలాటం ఉంటుంది.. రీసెంట్ గా రిలీజ్ అయిన అవతార్ 2 మూవీ.. ఓటీటీలోకి వచ్చేస్తుంది. థియేటర్లలో చూడలేని వాళ్లకు.. మరోసారి చూద్దాం అనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసింది అవతార్ 2.. విజువల్ వండర్ గా దర్శకుడు కామెరూన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 28వ తేదీ .. అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీతోపాటు మరికొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్  ద్వారా మూవీ రిలీజ్ కాబోతుంది. 

మార్చి 28వ తేదీ డిజిటల్ రిలీజ్ అవుతున్న అవతార్ 2ను చూడాలంటే.. అద్దె చెల్లించి సినిమా చూడాలి. రెంట్ ఆన్ డిమాండ్ బేసిస్ కింద మూవీని అందుబాటులోకి తీసుకొస్తుంది టీం. ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా రిలీజ్ అవుతుంది. మూవీ షూటింగ్ విశేషాలు, ఇంటర్వ్యూలు, సినిమా మేకింగ్ సీన్స్.. ఇలాంటి అన్నింటిని కలిపి.. మరో మూడు గంటల వీడియోను కూడా అప్ లోడ్ చేస్తోంది హాట్ స్టార్. ఇప్పటి వరకు ఏ సినిమాను ఈ విధంగా అందించలేదు.. ఫస్ట్ టైం అవతార్ 2 మూవీ మేకింగ్ సీన్స్ తో.. చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలతో ఓ స్పెషల్ వీడియో తీసుకురావటం విశేషం. 

అవతార్ 2 మూవీ రన్ టైం 3 గంటలు ఉంది.. దీనికి అదనంగా మరో మూడు గంటల వీడియో.. మొత్తంగా అవతార్ 2 చూడాలంటే ఆరు గంటలు రన్ టైంను.. మార్చి 28వ తేదీ రిలీజ్ కాబోతున్నది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంకా థియేటర్లలో ఈ సినిమా ఆడుతూనే ఉంది. అయినా కూడా ఓటీటీలోకి రిలీజ్ చేయాలని డిసైడ్ కావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో కామెరూన్ మూవీస్ ఏవీ కూడా ఇంత త్వరగా ఓటీటీలోకి వచ్చిన సందర్భాలు లేవు.. అవతార్ 2 మాత్రమే వంద రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది...