V6 News

దేశంలో అతి పిన్నవయసు మహిళా పైలెట్ ఆయేషా అజీజ్

దేశంలో అతి పిన్నవయసు మహిళా పైలెట్ ఆయేషా అజీజ్

కశ్మీర్ యువతి ఆయేషా అజీజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలెట్ గా నిలిచారు. ఆమె వయసు 25ఏళ్లు. 15 ఏళ్ల వయసులోనే ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన ఈ కశ్మీర్ అమ్మాయి… 16 ఏళ్లకే రష్యాలోని సోకోల్ ఎయిర్ బేస్ లో మిగ్-29 జెట్ ట్రైనర్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు. 2017లో ఆమె బాంబే ఫ్లయింగ్ క్లబ్ నుంచి వైమానిక రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అదే ఏడాది కమర్షియల్ లైసెన్స్ కూడా అందుకున్నారు.

తనకు చిన్నతనం నుంచి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టమని తెలిపారు ఆయేషా. ముఖ్యంగా ఆకాశంలో విహరించడం ఎంతో ఇష్టమని తెలిపారు. ఎంతో మంది ప్రజలను కలుసుకునే వీలుంటుందని, ఈ కారణాలతోనే తాను పైలెట్ అయ్యానని చెప్పారు.