కోర్టు ధిక్కరణ కేసు విచారణకు అటెండ్​ అయిన అజారుద్దీన్

కోర్టు ధిక్కరణ కేసు విచారణకు అటెండ్​ అయిన అజారుద్దీన్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ క్రికెట్​అసోసియేషన్‌(హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా హైకోర్టులో విచారణకు హాజరయ్యారు.

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహించే లీగ్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ను అనుమతించాలన్న ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ శుక్రవారం  విచారణ చేపట్టారు. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేశారు.