9వ నిజాంగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్

9వ నిజాంగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్

హైదరాబాద్, వెలుగు: ఎనిమిదో నిజాం ముకరం జా మరణంతో ఆయన పెద్ద కొడుకు మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ ​తొమ్మిదో నిజాంగా పట్టాభిషేకం చేశారు. శుక్రవారం చౌమహల్లా ప్యాలెస్‌‌‌‌లోని పట్టాభిషేక మందిరంలో కుటుంబ సభ్యులు, ట్రస్టీల సమక్షంలో ప్రార్థనలతో సాదాసీదాగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇందుకు సంబంధించి శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదో నిజాం కోరిక మేరకే ఈ నిర్ణయం జరిగిందని, అసఫ్ జాహీ రాజవంశం ఆచారాలు, సంప్రదాయాలను అనుసరించి లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం జరిగిందని తెలిపారు. దీంతో నిజాం ఆస్తులు, ట్రస్టులు తదితర బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారనే ఊహాగానాలకు తెరపడినట్లయింది.