మ్యాక్స్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. కిచ్చా రాక్షస యుద్ధం ప్రారంభం

మ్యాక్స్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. కిచ్చా రాక్షస యుద్ధం ప్రారంభం

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kichcha Sudeep) మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రానున్నారు. మ్యాక్స్ అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. మ్యాక్స్ సుదీప్ 46వ మూవీగా రాబోతుంది. ఇవాళ(ఆగస్టు 2న) కిచ్చా సుదీప్ బర్త్డే స్పెషల్గా ఈ టైటిల్ గ్లింప్స్ని రిలీజ్ చేశారు మేకర్స్.

రిలీజైన టైటిల్ గ్లింప్స్ లో..నార్త్ డైరెక్షన్​లో హెవీ వెపన్స్ తో పది వెహికల్స్ లో వస్తున్నార్​ సార్. వెస్ట్​ నుంచి 12, ఈస్ట్ నుంచి 13 హెహికల్స్..అంటూ బ్యాక్​గ్రౌండ్లో పోలీస్ వాయిస్​ రాగా..'రాబోయే వాళ్ళు అగ్నిపర్వతం నుంచి తప్పించుకోవచ్చు, భూకంపం నుంచి తప్పించుకోవచ్చు, తుపాను, సునామీ నుంచి కూడా తప్పించుకోవచ్చు. కానీ వీడితో పెట్టుకుంటే సావు లేని వరంతో పుట్టినోడు కూడా చస్తాడు' అంటూ హీరో కిచ్చా సుదీప్​ ఎంట్రీకి ఎలివేషన్ ఇచ్చే సీన్ ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో సుదీప్ చాలా వైల్డ్గా కనిపిస్తున్నారు. చాలా పవర్ ఫుల్ రోల్లో కనిపించే సుదీప్ ఈ మూవీతో..స్ట్రాంగ్ హిట్ను సొంతం చేసుకోవడం కన్ఫర్మ్ అంటున్నారు ఆడియన్స్. సుదీప్ మాస్ బాడీ లాంగ్వేజ్,వైల్డ్ లుక్తో ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ ఎంతోగానూ కనెక్ట్ అవ్వగా..ఈ టైటిల్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

మ్యాక్స్ టైటిల్ లో కనిపిస్తోన్న పుర్రె బొమ్మ డార్క్ నెస్ హార్రర్ ను తలపిస్తూ..క్యూరియాసిటీని పెంచుతుంది.తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు సుదీప్. ఇక త్వరలో మ్యాక్స్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. 

కాంతారా మూవీకి వర్క్ చేసిన అజనీష్ లోకనాథ్ (Anjaneesh Loknath) ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మాక్స్ టైటిల్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీతో విజయ్ కార్తికేయ(Vijaykartikeyaa) అను కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. కాగా ఈ మూవీని కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను(Kalaippuli S Thanu)  ప్రొడ్యూస్ చేస్తున్నాడు.