ముగిసిన బీఏసీ సమావేశం

ముగిసిన బీఏసీ సమావేశం

అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై స్పీకర్ పోచారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. రేపు (శనివారం) గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేపట్టాలని సభ్యులు నిర్ణయించారు. 6న ఆర్థిక మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 8న బడ్జెట్, పద్దులపై చర్చించనున్నారు. 8న మరోసారి భేటీయై అసెంబ్లీ సమావేశాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని సభ్యులు నిర్ణయించారు.

25 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ కోరినట్లు తెలుస్తోంది. భేటీలో భట్టి విక్రమార్క ప్రొటోకాల్ సమస్యను ప్రస్తావించినట్లు సమాచారం. చాలా సమస్యలపై చర్చ జరగాల్సి ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేయగా.. బడ్జెట్పై చర్చ అనంతరం మిగతా అంశాలపై చర్చిద్దామన్న ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.