V6 News

16 మందితో బీఎల్ఎఫ్​రెండో లిస్ట్ రిలీజ్

16 మందితో బీఎల్ఎఫ్​రెండో లిస్ట్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు:  బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్​ఎఫ్) 16 మంది అభ్యర్థులతో  కూడిన రెండో లిస్టును రిలీజ్ చేసింది. గురువారం ఓంకార్ భవన్​లో బీఎల్ఎఫ్​ నేతలు నల్లా సూర్యప్రకాశ్, దండి వెంకట్ లిస్ట్ వివరాలు వెల్లడించారు. వరికుప్పల వెంకన్న(సూర్యపేట), తుడుం అనీల్ కుమార్ (శేర్ లింగంపల్లి), మేత్రి రాజశేఖర్ (నిజామాబాద్ రూరల్), మూడీ మార్టిన్ (మేడ్చల్), కుర్ర రవీందర్ గౌడ్ (కుత్బుల్లాపూర్), ఏపూరి సోమన్న (కోదాడ), హరీశ్ గౌడ్ (రాజేంద్రనగర్), చంద్రునాయక్ (ములుగు), బుర్ర శ్రీనివాస్ గౌడ్ (హుస్నాబాద్), ఎం.లక్ష్మమ్మ (నాగర్ కర్నూల్), మన్నేముని తిరుపతమ్మ (కొల్లాపూర్),  తిరుపతమ్మ (కల్వకుర్తి), మేతరి మంజుల (మక్తల్), హరినాథ్ గౌడ్ (చంద్రయన్ గుట్ట), మేకల శ్యాం సుందర్ (ఉప్పల్), సురేశ్ నాయక్ (దేవరకొండ) తదితరుల పేర్లను ప్రకటించారు.  ఇదివరకే 18మందితో తొలి లిస్టును రిలీజ్ చేశారు. కాగా, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోతామనీ, తమ  అభ్యర్థులను గెలిపించాలని నేతలు కోరారు.  సమావేశంలో గాదగోని రవి, పాండురంగాచారి, వనం సుధాకర్, ఉపేందర్ రెడ్డి, సుకన్య తదితరులు పాల్గొన్నారు.