V6 News

భారీ లైనప్‌‌తో బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ ఇన్ని సినిమాలే !

భారీ లైనప్‌‌తో బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ ఇన్ని సినిమాలే !

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పవర్‌‌‌‌ఫుల్ లైనప్స్‌‌తో దూసుకెళ్తున్నారు  బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాక్‌‌డ్రాప్‌‌ మూవీ చేస్తున్నారు. ‘వీర సింహారెడ్డి’ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న  యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు వరుసగా యంగ్ డైరెక్టర్స్‌‌తో సినిమాలు చేసేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల శివతో ఓ సోషల్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

తాజాగా  బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం  వంటి చిత్రాలతో మెప్పించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ  కొత్త గ్యాంగ్‌‌స్టర్ డ్రామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముంబై బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు అల్లరి నరేష్‌‌తో నాంది, ఉగ్రం వంటి సీరియస్ సినిమాలు తీసిన  విజయ్ కనకమేడల డైరెక్షన్‌‌లో బాలయ్య  పోలీస్ బ్యాక్‌‌డ్రాప్ మూవీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.  అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌లో మరో భారీ ప్రాజెక్ట్ కూడా రానుందని తెలుస్తోంది. ఈ లైనప్‌‌తో బాలయ్య మాస్‌‌తో పాటు కొత్త జానర్లను కూడా ట్రై చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.