పద్మారావునగర్, వెలుగు: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మంగళవారాన్ని పురస్కరించుకొని అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు. అర్చకులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో ఎల్లమ్మ తల్లిని అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి, పూజలు చేశారు.
