ఫీజు రీయింబర్స్ మెంట్  పథకానికి ప్రభుత్వం తూట్లు

ఫీజు రీయింబర్స్ మెంట్  పథకానికి  ప్రభుత్వం తూట్లు

టీఆర్ఎస్ ప్రభుత్వం  ఫీజు రీయింబర్స్ మెంట్  పథకానికి తూట్లు పొడిచిందన్నారు  బీజేపీ   రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీసీ విద్యార్థుల  ఫీజు రీయింబర్స్ మెంట్,  స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే  చెల్లించాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా బీసీ  విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్ మెంట్,  స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో  దాదాపు 3వేల కోట్లు  బకాయిలు పేరుకు  పోయాయన్నారు. కాలేజీలు  ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు బండి సంజయ్. ప్రభుత్వ  నిర్లక్ష్యంతో దాదాపు 14 లక్షల  మంది బీసీ విద్యార్థులు  మానసిక క్షోభ  అనుభవిస్తున్నారన్నారు.   ఫీజులు చెల్లించకపోవడంతో  బీటెక్, బీఈ, ఎంటెక్,  MBA MCA  కోర్సులు పూర్తి  చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు  కాలేజీలు  నిరాకరిస్తున్నాయన్నారు  సంజయ్.