కేసీఆర్ గడీలు బద్దలు కోట్టైనా సరే దళితబంధు ఇప్పిస్తం

కేసీఆర్ గడీలు బద్దలు కోట్టైనా సరే దళితబంధు ఇప్పిస్తం

ప్రగతి భవన్ దగ్గర కేసీఆర్ కు RRR(రఘునందన్ రావు,రాజాసింగ్, రాజేందర్) సినిమా చూపించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో బండి సంజయ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఈవీఎంలో ఒకటో నెంబర్ మీద ఒత్తితే కేసీఆర్ కు గూబగుయ్యి అనాలన్నారు.  కేంద్రం పైసలు ఇస్తే రాష్ట్రం గుంటనక్కాలా దోచుకుంటుందన్నారు. టీఆర్ఎస్ దండుపాళ్యం బ్యాచ్ ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతుందన్నారు. కేసీఆర్ బ్యాచ్ దొంగ సర్వేలు  చేసి అందరికి మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ కు కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు. అధ్భుతాలు సృష్టించిన తర్వాతే కేసీఆర్ పుట్టిండు కానీ. కేసీఆర్ అద్భుతాలు సృష్టించలేదన్నారు.  మోడీ తెలంగాణకు 3 లక్షల ఇండ్లు ఇస్తే టీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. దళితబంధు రావాలంటే ఈటల రాజేందర్ను గెలిపించాలన్నారు. తాను ,రాజేందర్ కలిసి కేసీఆర్ గడీలు బద్దలు కొటట్టైనా సరే  దళితంబంధు ఇప్పిస్తామన్నారు.  పెట్రోల్ మీద కేసీఆర్ రూ.41 కమిషన్ దొబ్బిపోతుండన్నారు.