కారు రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా పనికి రాకుండా పోయింది : సంజయ్

 కారు రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా  పనికి రాకుండా పోయింది : సంజయ్
  • కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంజయ్ కౌంటర్  

హైదరాబాద్, వెలుగు: కారు రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా పనికి రాకుండా పోయిందని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి  సంజయ్ విమర్శించారు. ‘‘కారు పార్టీ వాళ్లు వాళ్ల పని చూసుకుంటే మంచిది. వాళ్ల వాహనం కారు ఇప్పటికే రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా పనికి రాకుండా షెడ్డులో పడిపోయింది. 

కనీసం దాన్ని సెకండ్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కొనేందుకు కూడా ఎవరూ రెడీగా లేరు” అని ఎద్దేవా చేశారు. ‘బీజేపీ.. పూజకు పనికిరాని పువ్వు’ అంటూ కేటీఆర్​చేసిన కామెంట్లకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అలాంటి మాటలు మాట్లాడేవాళ్ల బుద్ధి పనిచేయడం లేదని తెలుస్తోందంటూ మంగళవారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.