బండి సంజయ్ హౌస్ అరెస్ట్

బండి సంజయ్ హౌస్ అరెస్ట్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులు జేబీఎస్ వద్ద నిరసనకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకు బండి సంజయ్ వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  బండి సంజయ్ ను హౌస్ అరెస్ట్ చేశారనే సమాచారంతో బీజేపీ శ్రేణులు ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఆందోళన నిర్వహించి తీరుతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

మరోవైపు  బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డిని పోలీసులు అర్దరాత్రి  అరెస్ట్ చేశారు.  ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో జిట్టాను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 2 న ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’ నిర్వహించారు. అయితే.. ఆ సభలో జిట్టా బాలకృష్ణ రెడ్డి సీఎం కేసీఆర్ ను కించపరిచే విధంగా స్కిట్ వేయించారని ఆయనపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు.