కేసీఆర్ అవినీతిపై చర్యలు తప్పవు

కేసీఆర్ అవినీతిపై చర్యలు తప్పవు

గడీల పాలనలో తెలంగాణ ప్రజలవి బానిస బతుకులయ్యాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద జయంతి వేడుకల్లో బండి సంజయ్ సహా..కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాధన లక్ష్యాలకు భిన్నంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు.  గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడి కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించాలన్నారు. కేసీఆర్ అవినీతి మీద చర్యలు తప్పవన్నారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ డ్రామాలాడుతున్నారన్నారు బండి సంజయ్. ఫ్రంట్ లేదు టెంట్ లేదు..దోచు కోవడం దాచుకోవడమే కేసీఆర్ పార్టీ ఉద్దేశమన్నారు. కేసీఆర్ ను ఎక్కడున్నా  గుంజుకొచ్చి జైల్లో వేస్తామన్నారు. ఫామ్ హౌస్ లో పండేటోడికీ దేశ రాజకీయాల్లో వెళ్ళి ఏం చేస్తాడని ప్రశ్నించారు.

 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి కొవిడ్ పాజిటివ్

నన్ను క్షమించు.. కావాలని కామెంట్ చేయలే