టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు..అందుకే కేసీఆర్ కు భయం

టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు..అందుకే కేసీఆర్ కు భయం
  • ప్రధానిని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి..ఫాల్తు రాజకీయాలు చేస్తున్నడు: సంజయ్
  • టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు..అందుకే భయపడుతున్నడు
  • సుప్రీం తీర్పుపై రిటైర్డ్ జడ్జీలు లేఖ రాస్తే మాకేం సంబంధం?
  • నీకు రోజులు దగ్గర పడ్డయ్..దేవుళ్లను కించపరుస్తున్నవ్
  • రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్నది..బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నది


 కేసీఆర్ క్యాల్ తప్పి మాట్లాడుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారు కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారని, ఆయనను చూసిప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రధానిని గౌరవించే సంస్కారం చెప్పారు. దేశ ప్రధానిని గౌరవించే సంస్కారం లేని వ్యక్తి అని, ఫాల్తు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

జోగులాంబ అమ్మవారిపైనే వ్యంగ్యంగా మాట్లాడుతవా?

జోగులాంబ అమ్మవారి శక్తి పీఠాన్ని తిట్టే స్థాయికి కేసీఆర్ వచ్చిండు, జోగులాంబ శక్తి పీఠాన్ని ఈ అంబ ఆ అంబ అంటవా..అమ్మ వారి గురించి వ్యంగ్యంగా మాట్లాడే స్థాయికి వచ్చావా..నీకు రోజులు దగ్గర పడ్డయ్ దేవుళ్లను, తిడ్తవ్, కించపరుస్తవ్..అదే మీకు అంతం, రాజకీయ సమాధి కాబోతున్నది..జోగులాంబ అమ్మవారిని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.అని డిమాండ్ చేశారు.“ప్రెస్ మీట్ లో 100 సార్లు ఏక్ నాథ్ షిండే అని కేసీఆర్  చెప్పిండు.  షిండేలు  టీఆర్ ఎస్​లో ఉన్నరు కాబట్టే సీఎం  షిండే, షిండే అని చెప్తున్నాడు. కేసీఆర్ .. అల్లుడు, కొడుకు, బిడ్డలో ఎవరైనా షిండేలు కావొచ్చు” అని సంజయ్​ పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ‘‘నీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని  కూల్చటానికి రెడీ అయిన్రు. టీఆర్ ఎస్ నుంచి నీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నరు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ... ఎప్పుడు ఊడుతుందోనని నీ టీఆర్ ఎస్  పార్టీలో నేతలు అనుకుంటున్నరు” అని అన్నారు. టీఆర్​ఎస్​లో ఏదో జరుగుతున్నదని, అందుకే కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొన్నారు.  ‘‘విలేకరులకు కేసీఆర్​ దండం పెట్టే పరిస్థితి వచ్చింది. దానికే బీజేపీనే కారణం” అని అన్నారు. 

దేశంలో దోచుకుంటా అని బయల్దేరుతున్నడు

బీజేపీ ఎప్పుడూ సుప్రీంకోర్టును ప్రశ్నించినట్లు మాట్లాడలేదని బండి సంజయ్​ అన్నారు. కేసీఆరే గతంలో సుప్రీంకోర్టును ప్రశ్నించినట్లు మాట్లాడారని చెప్తూ..  గతంలో సుప్రీంకోర్టు పై కేసీఆర్  చేసిన కామెంట్ల వీడియోను చూపించారు. సుప్రీంకోర్టు తీర్పుపై రిటైర్డ్​ జడ్జీలు లేఖ రాస్తే తామకేమి సంబంధమని ప్రశ్నించారు. తాము అధికారం కోసం అర్రులు చాస్తే  మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం కాదు సీఎం అయ్యుండేవాళ్లమని సంజయ్ అన్నారు. ‘‘రాష్ట్రంలో అత్యాచారాలు చేసేవారిని పట్టుకోలేని దద్దమ్మ కేసీఆర్​. ఇక్కడ దోచుకొని..దేశంలో దోచుకుంటా అని బయల్దేరుతున్నడు” అని దుయ్యబట్టారు.  ‘‘విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఆస్తులు రూ.19,111 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. రూ.15, 114 కోట్లను ఆల్రెడీ బ్యాంకులకు తిరిగిచ్చిన్రు.. అరెస్టు భయంతో వాళ్లు తప్పించుకొని తిరుగుతున్నరు. ఈ విషయాలు తెలుసుకో ” అని కేసీఆర్​కు  సంజయ్ సూచించారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నదని, టీఆర్ఎస్ గ్రాఫ్ అంతే వేగంగా పడిపోతున్నదన్నారు. బీసీ నాయకుడు లక్ష్మణ్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, సొంత ప్రభుత్వ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  

ముర్ముకు టీఆర్​ఎసోళ్లు ఓటేయాలి

ద్రౌపది ముర్ముకు ఓటు వేసి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశానికి మంచి సంకేతాలు పంపాలని సంజయ్ సూచించారు. ‘‘కేసీఆర్ ను రజాకార్లు ఆవహించారు. అందుకే ఎమర్జెన్సీని కూడా పొగుడ్తున్నారు. త్వరలో రానున్న రజాకార్ల ఫైల్స్ సినిమా చూసి కేసీఆర్ గుండె ఆగుతుంది” అని అన్నారు.  యూపీ సీఎం యోగిపై కేసీఆర్ చేసిన కామెంట్స్ పై ప్రజలు ఆలోచించాలని సంజయ్ సూచించారు. యోగి కుటుంబం గురించి కేసీఆర్ తెల్సుకోవాలన్నారు. ‘‘కేసీఆర్  కుటుంబానికి, యోగి కుటుంబానికి చాలా తేడా ఉంది” అని తెలిపారు.