
- పదేండ్లలో మేం అడగలే.. ఆ సర్కారు ఫూలే విగ్రహం పెట్టలే!
- ఇప్పుడు అడుగుతున్నం పెడ్తరా లేదా..?
- మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
- బీసీల మీద ప్రేముంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఫ్యామిలీకి ఏం చేశారు
- ఓడిపోయావ్ కదా ఇక రెస్ట్ తీసుకోవాలి
- కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేశ్
హైదరాబాద్: పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఆవరణలో జ్యోతీరావు ఫూలే విగ్రహం ఎందుకు పెట్టలేదన్న విమర్శలపై కవిత స్పందించారు. తాము ఫూలే విగ్రహం గురించి గత ప్రభుత్వాన్ని అడగలేదని, అందుకే వాళ్లు పెట్టలేదన్నారు. ఇప్పుడు అడుగుతున్నామని.. ఈ ప్రభుత్వం పెడ్తదా..? లేదా..? క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవిత కామెంట్లకు సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఫూలే విగ్రహాన్నిపెట్టలేదని, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం ఇల్లు ఇచ్చిన బీసీ నేత కొండా లక్ష్మణ్ బాపూజీకి గత ప్రభుత్వం ఇచ్చిన మర్యాద ఏంటని ప్రశ్నించారు. కవిత ఎంపీగా ఓడిపోతే ఇంట్లో ఏడ్చి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుందని ఎద్దేవా చేశారు. ఓడిపోయిన వాళ్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అద్భుతమైన ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు.