MAA ఎన్నికల్లో నా  విజయాన్ని ఎవరూ ఆపలేరు

MAA ఎన్నికల్లో నా  విజయాన్ని ఎవరూ ఆపలేరు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA ) ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా బండ్ల గణేశ్ పోటీ చేస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో ఉన్న బండ్ల గణేశ్... ఆ తర్వాత ప్యానల్ లోకి జీవిత రావడంలో బయటకు వచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. దీనిపై మీడియాతో మాట్లాడాడు. ఎన్నికల్లో తాను రాకెట్ లా దూసుకుపోతానని చెప్పాడు. తాను గెలిస్తే కనీసం 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానన్నారు. అంతేకాదు.. తన విజయాన్ని ఎవరూ ఆపలేరని.. తన వెనుక ఎవరున్నారో, ఎంతమంది ఆశీస్సులు ఉన్నాయో ఎవరికీ తెలియదని చెప్పాడు. 

అసోసియేషన్ కు సొంత బిల్డింగ్ కావాలని బండ్ల గణేశ్ చెప్పాడు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతంలో ప్యాలస్ లాంటి భవనం కడతామంటే కుదరదని అన్నారు. కొంచెం దూరమైనా కోకాపేట ప్రాంతంలో స్థలం తీసుకుని... 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని చెప్పాడు. సీఎం కేసీఆర్  దగ్గరకు వెళ్లి స్థలం ఇవ్వాలని అడగాలని... ఆ స్థలంలో మన డబ్బులతో మనం కావాల్సింది చేసుకుందామని అన్నాడు. పేద కళాకారులకు ఇళ్లను కట్టించి ఇవ్వడం చాలా గొప్ప పని అని చెప్పాడు. ఫండ్స్ కోసం ఎక్కడో విదేశాలకు వెళ్తామని చెపుతున్నారని... అంత అవసరం ఏముందని ప్రశ్నించాడు. మన హీరోలు కోహినూర్ వజ్రాలు, బంగారు గనులని... ఆ వజ్రాలు ప్రకాశిస్తే ఎన్ని భవనాలైనా కట్టొచ్చన్నాడు.