నాని ఈ రేంజ్ యాక్షన్‌‌‌‌ చేయడం ఇదే ఫస్ట్ టైమ్: రామ్, లక్ష్మణ్ మాస్టర్స్ 

నాని ఈ రేంజ్ యాక్షన్‌‌‌‌ చేయడం ఇదే ఫస్ట్ టైమ్: రామ్, లక్ష్మణ్ మాస్టర్స్ 

‘ది ప్యారడైజ్‌‌‌‌’ చిత్రంలో నాని క్యారెక్టర్‌‌‌‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల  చాలా కొత్తగా డిజైన్ చేశాడని,  ఈ సినిమాలోని ఫైట్స్‌‌‌‌ కూడా అంతే కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ను ఇవ్వబోతున్నాయని చెప్పారు ఫైట్ మాస్టర్స్‌‌‌‌ రామ్, లక్ష్మణ్.  ఈనెల 24న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర విశేషాలను గురించి రామ్, లక్ష్మణ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ మాట్లాడుతూ ‘‘రెండు జడలు వేసుకున్న హీరోను ఇండియన్ స్క్రీన్‌‌‌‌పై ఇప్పటివరకు చూడలేదు. అది చాలా కొత్తగా అనిపించింది.  పైగా కొత్త ప్రపంచం. ఇలాంటి బాడీ లాంగ్వేజ్‌‌‌‌తో ఇంతకుముందు సినిమా కూడా రాలేదు. అందుకే ఫైట్స్ కంపోజ్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాం. చాలా రిస్కీ సీక్వెన్సులు ఉన్నాయి.  

మా యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి పది రోజులు పట్టింది. జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు రూప్‌‌‌‌లకు, ముఖానికి తగులుతాయి. ఈ తరహా సీక్వెన్సులు మాకు కూడా కొత్త అనుభవమే. అందుకే మా అసిస్టెంట్‌‌‌‌కు అలాంటి జడలు వేయించి అందులోని కష్టం తెలుసుకుని యాక్షన్‌‌‌‌ సీన్స్ కంపోజ్ చేశాం. 

నాని తన కెరీర్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో ఎప్పుడూ ఇంతలా కష్టపడి ఉండడు.  ప్రతి సీన్‌‌‌‌కు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డాడు. శ్రీకాంత్ విజన్‌‌‌‌కు పూర్తి న్యాయం చేశాడు. ఇందులో మేం రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేయగా, నవకాంత్, రియల్ సతీష్ కూడా వర్క్ చేశారు.