పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు.. ఇబ్బంది పడుతున్న పబ్లిక్

పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు.. ఇబ్బంది పడుతున్న పబ్లిక్

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ విలేజ్ లోని కాలనీల్లో వర్షాలకు డ్రైనీజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 16, 5 వార్డ్ డివిజన్లలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. రోడ్డు వెంట నడిచే బాటసారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.  

ఈ నీటితో దోమలు, ఈగల వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని.. రోగాలు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అధికారులు స్పందించి డ్రైనేజీలు క్లీన్ చేపించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.