దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. ఇండియాకు వచ్చే గ్యాస్ 50 శాతం గల్ఫ్ నుంచే వస్తుందని.. యుద్ధం కారళణంగా గల్ఫ్ నుంచి గ్యాస్ ఆగిందని తెలిపారు. గురువారం (మార్చి 12) యుద్ధంపై లోక్సభలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కెనడా, రష్యా నుంచి గ్యాస్ ను తెప్పిస్తున్నామని చెప్పారు.
గ్యాస్ వినియోగంలో దేశ ప్రజల ప్రాధాన్యతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు మంత్రి. హాస్పిటల్స్ వంటి అత్యవసర విభాగాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో గ్యాస్ ఉత్పత్తిని పెంచామని.. గత ఐదు రోజుల్లో ఎల్పీజీ ఉత్పత్తిని 28 శాతానికి పెంచినట్లు చెప్పారు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు.. గ్యాస్ బుకింగ్ కు 25 రోజుల టైం తెచ్చాం.. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ప్రజలు ఆందోళన అవసరం లేదు.. అని లోక్ సభలో ప్రకటించారు. పొరుగు దేశాలతో పోల్చితే ఇండియాలో గ్యాస్ ధరలు తక్కవే ఉన్నాయన్నారు.
హార్మూజ్ కు బదులుగా ఇతర మార్గాల్లో చమురు వస్తోందన్నారు మంత్రి. గల్ఫ్ దేశాల నేతలతో ప్రధాని మాట్లాడుతున్నారు.. ఇతర మార్గాల్లో 70 శాతం వస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.
