కాలేజీలోకి దూసుకొచ్చి.. పేలిపోయిన జెట్ విమానం : కాలిన గాయాలతో విలవిలలాడిన బాధితులు

కాలేజీలోకి దూసుకొచ్చి.. పేలిపోయిన జెట్ విమానం : కాలిన గాయాలతో విలవిలలాడిన బాధితులు

విమానాల్లో గాల్లో ఎగరాలి.. ఎయిర్ పోర్టుల్లో దిగాలి.. ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి.. గాల్లోకి ఎగిరిన విమానాలు కాలేజీ బిల్డింగ్స్ లోకి దూసుకొస్తున్నాయి.. మొన్నటికి మొన్న అహ్మదాబాద్ లో ఎయిర్ విమాన ప్రమాదం తరహాలోనే.. ఇప్పుడు సేమ్ టూ సేమ్ బంగ్లాదేశ్ దేశంలోనూ జరిగింది. జెట్ విమానం కాలేజీ బిల్డింగ్ లోకి దూసుకెచ్చి.. అక్కడ పేలిపోయింది. ఈ ఘటనలో పలువురు చనిపోవటంతోపాటు చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సిటీ నార్త్ ఏరియాలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ ఉంది. ఇది చాలా పెద్ద క్యాంపస్. ఇక్కడ వందల మంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. 2025, జూలై 21వ తేదీ మధ్యహ్నం ఒంటి గంట 30 నిమిషాల సమయంలో.. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలెట్ శిక్షణ విమానం జెట్ F- 7BJI.. కాలేజీ క్యాంపస్ లోకి దూసుకొచ్చింది. 10 అంతస్తులు కాలేజీ బిల్డింగ్ మూడో అంతస్తును ఢీకొట్టి.. కూలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చి పేలిపోయింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఒకరు చనిపోయినట్లు కాలేజీ సిబ్బంది వెల్లడించారు. చాలా మంది గాయపడ్డారని.. వాళ్లను ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు అధికారులు.

ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ జెట్ విమానం.. మధ్యాహ్నం ఒంటి గంట 6 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది. 24 నిమిషాలు గాల్లో తిరిగిన తర్వాత.. ఢాకా సిటీకి ఉత్తరం వైపున ఉన్న కాలేజీ క్యాంపస్ లోని బిల్డింగ్ ను ఢీకొట్టి.. పేలిపోయినట్లు ఎయిర్ పోర్ట్ సీనియర్ అధికారి ప్రకటించారు. 

ప్రమాదం తర్వాత గాయపడిన వాళ్ల పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. శరీరం అంతా కాలిపోయి రోడ్లపై పరుగులు పెడుతున్న విజువల్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. బాధితులను ఆదుకునేందుకు స్థానికులు సాయం చేస్తున్నారు. కొంత మంది కాలిన గాయాలతో పెద్ద పెద్దగా అరుస్తూ.. వైద్య సాయం కోసం పరిగెడుతున్నారు. 

ALSO READ : ఓ భార్య కథ : దుబాయ్‌లో భర్త చేతిలో చనిపోయిన అతుల్య..

విషయం తెలిసిన వెంటనే సైన్యం, ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. జెట్ విమానం కూలిన సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో చాలా మంది స్టూడెంట్స్, ఉపాధ్యాయులు గాయపడినట్లు చెబుతున్నారు. జెట్ విమానం పైలెట్ బతికి ఉన్నాడా లేదా అనే విషయంపై స్పష్టం రాలేదని అధికారులు వెల్లడించారు.