ఓ భార్య కథ : దుబాయ్‌లో భర్త చేతిలో చనిపోయిన అతుల్య.. కొత్త ఉద్యోగంతో వేధింపులు తగ్గుతాయ్ అనుకుంది కానీ..!

ఓ భార్య కథ : దుబాయ్‌లో భర్త చేతిలో చనిపోయిన అతుల్య.. కొత్త ఉద్యోగంతో వేధింపులు తగ్గుతాయ్ అనుకుంది కానీ..!

కేరళకు చెందిన సతీష్, అతుల్య దంపతులకు వివాహం జరిగి దాదాపు 10 ఏళ్ల గడిచింది. ప్రస్తుతం వారు దుబాయ్ నగరంలోని షార్జాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల షార్జా అపార్ట్మెంట్లో అతుల్య మరణించటంపై ఆమె తల్లిదండ్రులు అల్లుడే దీనికి కారణంగా ఆరోపించారు. ఈ ఘటనపై చవర తెక్కుంబాగం పోలీసులు సతీష్ పై కేసు నమోదు చేశారు. నిందితుడిపై వరకట్న వేదింపులు, మహిలపై దాడి సహా మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సతీష్ అతుల్యలకు 2014లో పెళ్లి జరిగింది. అప్పట్లో అతుల్య తల్లిదండ్రులుతు తమ తాహతుకు తగినట్లుగా 43 సవర్ల బంగారం, అల్లుడికి ఒక బైక్ ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ఒక పాప ఉంది. ఆ తర్వాత ఈ దంపతులు 2023 నుంచి దుబాత్ షార్జాలో నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే సతీష్ తనకు ఇచ్చిన కట్న కానుకలు సరిపోవని, ఇంకా కావాలంటూ భార్యను వేధించటం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షన జరిగింది. అనేక మార్లు అతుల్యపై చేయిచేసుకోవటం, ఆమెను దూషించటంతో పాటు మానసిక వేదనకు గురిచేశాడు సతీష్. అతడు క్రూరంగా ప్రవర్తిస్తున్నప్పుడు తీసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీడియో తీస్తున్న క్రమంలో భార్యను నీకు బోర్ కొట్టడం లేదా ఇలాంటి వీడియోలు ఇంకా తీయటానికి అంటూ అతుల్యను మెంటల్ టార్చర్ చేసేవాడు సతీష్.

ఈ క్రమంలోనే షార్జాలో శనివారం అతుల్య మృతి చెందినట్లు గుర్తించటం అందరినీ షాక్ గురిచేసింది. ఈ క్రమంలో అనేక మార్లు భర్త తనపై దాడి చేసినప్పటి వీడియోలను అతుల్య తన సోదరికి పంపించింది. ఆమె మృతిపై స్నేహితురాలు సబీనా మాట్లాడుతూ అతుల్య చాలా ధైర్యవంతురాలని చనిపోయేంత పిలికిది కాదని చెప్పింది. అయితే ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉండే ఆమె పలు మార్లు భర్త వేదింపుల గురించి చెప్పిందని, అయితే తన కుమార్తెపై ఉన్న ప్రేమ కారణంగా వాటిని భరించినట్లు చెప్పింది. 

ALSO READ : ట్విస్టు మీద ట్విస్టులు.. ఒకరి హత్యకు సుపారీ.. మరొకరిపై హత్యాయత్నం.. చివరికి

ఈ క్రమంలోనే భర్త వేధింపుల నుంచి తప్పించుకునేందుకు కొత్త ఉద్యోగంలో చేరాలని అతుల్య నిర్ణయించుకుందని తల్లిదండ్రులు చెప్పారు. అందుకోసం కొత్త బట్టలు కూడా కొనుక్కుందని.. కానీ ఆమె మరణించినట్లు తెలియటం మెుత్తం కుటుంబాన్ని షాక్ కి గురిచేసింది. దీనికి ముందు చివరిగా మూడు నెలల కిందట అతుల్య కుమార్తె షార్జాలో చదువుకోవటానికి ఇష్టపడటం లేదంటూ ఇండియాలోని తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చింది.