- సమ్మర్ ఎఫెక్ట్ తో 40% పెరిగిన సేల్స్
- వచ్చే 4 నాలుగు నెలల్లో బిజినెస్ భారీగా ఉంటుందని అంచనా
హైదరాబాద్: సమ్మర్ స్టార్ట్ కావడంతో చల్లని బీరుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మద్యం ప్రియులు ఎక్కువగా చిల్డ్ బీర్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో రోజురోజుకు బీర్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే బీర్ సేల్స్ దాదాపు 40 శాతం మేర పెరిగాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ అమ్మకాలు మరింత భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నా రు.
►ALSO READ | హైదరాబాద్ లో రేపు(మార్చి3)..వైన్స్, బార్లు బంద్..ఎందుకంటే.?
ఫిబ్రవరి నెల (28 రోజులు) మొత్తం మద్యం అమ్మకాలు రూ.3,209 కోట్లకు చేరుకున్నా యి. గత నెల 28న ఒక్కరోజే 3 లక్షల 28 వేల బీర్ కేసులు అమ్ముడవ్వగా, అదే రోజున 2 లక్షల 85 వేల హార్డ్ లిక్కర్ కేసులు సేల్ అయ్యాయి. ఫిబ్రవరి నెల మొత్తం సుమారు 39 లక్షల బీర్ కేసులు, 30 లక్షల హార్డ్ లిక్కర్ కేసులు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతు న్నాయి. మరోవైపు వేసవిలో బీర్ కొరత తలెత్త కుండా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీ సుకుంటున్నారు. ఇటీవలే సంగారెడ్డిలోని బీర్ కంపెనీలను ఉన్నతాధికారులు రఘునందన్ రావు, హరికిరణ్ పరిశీలించారు.
