Police Complaint: వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర 'పోలీస్ కంప్లైంట్'.. అదిరిపోయే మెలోడీ సాంగ్ రిలీజ్!

Police Complaint: వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర 'పోలీస్ కంప్లైంట్'.. అదిరిపోయే మెలోడీ సాంగ్ రిలీజ్!

హృదయాన్ని హత్తుకునేలా..

ఈ చిత్రంలోని "ప్రేమ ఓ ప్రేమ" అనే మెలోడియస్ సాంగ్‌ను లాంచ్ చేశారు. సుధాకర్ మారియో సమకూర్చిన బాణీలు ఈ పాటకు ప్రాణం పోశాయి. వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర జంట మధ్య కెమిస్ట్రీ ఈ సాంగ్‌లో హైలైట్‌గా నిలిచింది. అన్విక ఆడియోస్ ద్వారా విడుదలైన ఈ పాట ప్రస్తుతం మెలోడీ ప్రియులకు ఈ పాట ఒక మంచి ట్రీట్ అని చెప్పవచ్చు.

యాక్షన్ థ్రిల్లర్‌గా ‘పోలీస్ కంప్లైంట్’

సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్ కలిసిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. సాధారణంగా వరలక్ష్మి శరత్ కుమార్ అంటే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ లేదా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా భిన్నంగా, కొత్త కోణంలో ఉండబోతోందని దర్శకుడు తెలిపారు. నవీన్ చంద్ర సైతం తన నటనతో సినిమాకు వెయిట్ పెంచారు.

భారీ తారాగణం..
ఈ సినిమాలో కేవలం లీడ్ పెయిర్ మాత్రమే కాకుండా, సౌత్ ఇండియాలోని ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ముఖ్యంగా డ్రాగన్ ప్రకాష్, రవితేజ మాస్టర్స్ నేతృత్వంలో వచ్చిన ఫైట్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ అసెట్ కానున్నాయి. ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ ఈ థ్రిల్లర్ కథకు తగిన విజువల్స్ అందించారు.

►ALSO READ | ఇక నుంచి రెగ్యులర్గా వస్తా.. ఊరికి చేసేది చాలా ఉంది.. సొంత ఊరిలో విజయ్ దేవరకొండ

త్వరలోనే థియేటర్లలోకి..

ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలలో నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ సర్టిఫికెట్ పొందింది. సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన  చిత్రం ‘సరస్వతి’.  తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె నిర్మించింది. మార్చి 6న సినిమా విడుదల కానుంది.