T20 World Cup: హెట్మెయర్ నాటౌట్.. భారత్ వరల్డ్ కప్ గెలవదు?.. మళ్లీ చిల్లర వ్యాఖ్యలు చేసిన పాకీ క్రికెటర్

T20 World Cup: హెట్మెయర్ నాటౌట్.. భారత్ వరల్డ్ కప్ గెలవదు?.. మళ్లీ చిల్లర వ్యాఖ్యలు చేసిన పాకీ క్రికెటర్

T20 World Cup: పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. వెస్టిండీస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్  ఔట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ టీవీ ప్రోగ్రామ్ ‘హర్ణ మన హై’లో మాట్లాడుతూ, “హెట్మెయర్ ఔట్ పూర్తిగా వివాదాస్పద నిర్ణయం.. నా అభిప్రాయం ప్రకారం అతను ఔట్ కాలేదు.. అతను ఇంకొంచెం సేపు క్రీజ్‌లో ఉన్నట్లు అయితే స్కోరు 220–230కు చేరితే భారత్ ఈరోజే టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించేది అని ఆయన వ్యాఖ్యానించాడు.

 అలాగే భారత్ వరల్డ్ కప్ గెలవదని పాక్ మాజీ క్రికెటర్ అమీర్ కామెంట్స్ చేశాడు. సెమీఫైనల్‌కు చేరిన మిగతా జట్లు భారత్ కంటే బలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. క్రికెట్ లో ఇండియా మంచి ఆట ఆడటం లేదు.. ఫీల్డింగ్‌లో మూడు నాలుగు క్యాచ్‌లు వదిలేశారు.. బుమ్రా తప్ప మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారని వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్ పెద్ద జట్ల మీద సరిగ్గా ఆడలేరని తెలిపాడు. వెస్టిండీస్ స్పిన్‌ను అంతగా ఆడలేరు.. ఇంకా భారత్ ఎదుర్కోబోయే జట్లు మరింత బలంగా ఉంటాయని మహమ్మద్ అమీర్ విమర్శించాడు.

ఈ టోర్నమెంట్‌లో వెస్టిండీస్ తరఫున షిమ్రాన్ హెట్మెయర్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్.. 7 మ్యాచ్‌ల్లో 248 పరుగులు చేసి 186.46 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. మొత్తం 19 సిక్సర్లు, 16 ఫోర్లు బాదాడు. ముఖ్యంగా భారత బౌలర్లైన జస్ ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో హెట్మెయర్ మ్యాచ్-అప్‌పై మ్యాచ్ ముందు పెద్ద ఎత్తున చర్చ జరిగిందని అమీర్ పేర్కొన్నారు. అయితే అమీర్ ముందుగా భారత్ సెమీఫైనల్‌కు చేరదని చెప్పినా, వెస్టిండీస్‌పై వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధించిన భారత్ ఇప్పుడు సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.