V6 News

నీళ్లు రావట్లేదని ట్యాంకర్ల అడ్డగింత.. తట్టిఖాన రిజర్వాయర్ దగ్గర బస్తీ వాసుల ఆందోళన

నీళ్లు రావట్లేదని ట్యాంకర్ల అడ్డగింత.. తట్టిఖాన రిజర్వాయర్ దగ్గర బస్తీ వాసుల ఆందోళన

 జూబ్లీహిల్స్ , వెలుగు: బంజారాహిల్స్ తట్టిఖాన రిజర్వాయర్ వద్ద స్థానిక బస్తీవాసులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్ నంబర్ 14, నందినగర్, బీరప్ప గల్లీ ప్రాంతాలకు సరిపడా మంచినీరు అందడం లేదని ఆరోపిస్తూ మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి వాటర్ ట్యాంకర్లను అడ్డుకున్నారు.

పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తమకు నీళ్లు అందే వరకు ట్యాంకర్లను కదలనివ్వబోమని భీష్మించుకుర్చున్నారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన 
విరమించారు.