అక్టోబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే

అక్టోబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే

అక్టోబర్  నెలలో బ్యాంకులకు  మొత్తం 18  రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో రెండో శనివారం, నాల్గో శనివారం, ఆదివారాలు కలిపి ఉంటాయిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది.  ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం  అక్టోబర్ లో 11 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండకపోవచ్చు.  

అక్టోబర్ 1న ఆదివారం సెలవు ఉండనుంది. ఆ తర్వాత 2న గాంధీ జయంతి కాబట్టి..బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 24వ తేదీన దసరా పండగ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. 


అక్టోబర్ నెలలో  బ్యాంక్ సెలవులు

  • అక్టోబర్ 2న బ్యాంకులకు సెలవు: మహాత్మా గాంధీ జయంతి (అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి)
  • అక్టోబర్ 14న బ్యాంకులకు సెలవు: మహాలయ (కోల్‌కతా)
  • అక్టోబర్ 18న బ్యాంకులకు సెలవు: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా)
  • అక్టోబర్ 21న బ్యాంకులకు సెలవు: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్ కతా)
  • అక్టోబర్ 23న బ్యాంకులకు సెలవు: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం).
  • అక్టోబర్ 24న బ్యాంకులకు సెలవు: దసరా,దుర్గాపూజ (హైదరాబాద్, ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా)
  • అక్టోబర్ 25న బ్యాంకులకు సెలవు: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
  • అక్టోబర్ 26న బ్యాంకులకు సెలవు: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్)
  • అక్టోబర్ 27న బ్యాంకులకు సెలవు: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
  • అక్టోబర్ 28న బ్యాంకులకు సెలవు: లక్ష్మీ పూజ (కోల్‌కతా)
  • అక్టోబర్ 31న బ్యాంకులకు సెలవు: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్)

అక్టోబర్‌లో  ఏడు వారాంతపు సెలవులు ఉన్నాయి.

  • అక్టోబర్ 1: ఆదివారం
  • అక్టోబర్ 8: ఆదివారం
  • అక్టోబర్ 14: రెండవ శనివారం
  • అక్టోబర్ 15: ఆదివారం
  • అక్టోబర్ 22: ఆదివారం
  • అక్టోబర్ 28: నాల్గవ శనివారం
  • అక్టోబర్ 29: ఆదివారం

 మొత్తంగా, అక్టోబర్ 2023లో 18 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి.