- నేటి నుంచి వచ్చే నెల 12 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో 2026–-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు బీసీ గురుకుల సెక్రటరీ మంగళవారం ప్రకటించారు. బుధవారం నుంచి వచ్చే నెల 12 వరకు అప్లికేషన్లకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు బుధవారం నుంచి ఆన్ లైన్ లో https://mjptbcwreis.telangana.gov.in (లేదా) https://mjptbcadmissions.org/MJP-Inter వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని సెక్రటరీ సూచించారు. రాష్ర్టవ్యాప్తంగా 146 కాలేజీలలో బాలురకు 12,640 సీట్లు, 144 కాలేజీలలో బాలికలకు 12,080 సీట్లు ఉన్నాయని వివరించారు.
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని చెప్పారు. బీసీ గురుకులాల్లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారి స్కూల్ ప్రిన్సిపాల్స్ కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040 -2332 8266 నంబర్ ను సంప్రదించాలన్నారు. జూనియర్ ఇంటర్మీడియెట్ లో రెగ్యులర్ 5 గ్రూప్ లు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీతో పాటు మరో 7 ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయని తెలిపారు.

