V6 News

కొహ్లీ,రోహిత్ లపై బీసీసీఐ ఫోకస్

కొహ్లీ,రోహిత్ లపై బీసీసీఐ ఫోకస్

టీమిండియాలో కెప్టెన్ కొహ్లీ,వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నట్లు వార్తలు వస్తుండటంతో బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వెస్టిండిస్ టూర్ కు బయలు దేరనున్న టీమిండియా రెండు టీ 20 మ్యాచ్ లను యూఎస్ లో ఆడనుంది. అయితే బీసీీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి యూఎస్ వెళ్లి కొహ్లీ, రోహిత్ తో మాట్లాడి వారి మధ్య ఉన్న విభేదాల్ని పరిష్కరించనున్నారని బీసీసీఐ వర్గాల సమాచారం. వారిద్దరి మధ్య విభేదాల్ని పరిష్కరిస్తే జట్టు మరింత మెరుగ్గా రాణిస్తుందని బీసీసీఐ అభిప్రాయం.