V6 News

జస్ట్ 30 మినిట్స్ జర్నీ: హుస్నాబాద్ టూ కరీంనగర్..ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు ప్రారంభం

జస్ట్ 30 మినిట్స్ జర్నీ: హుస్నాబాద్ టూ కరీంనగర్..ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు ప్రారంభం
  • 20కి.మీకు రూ.163.20 కోట్లు 
  • ప్రస్తుతం రూ.77  కోట్లతో ఫేజ్ 2 పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఊర్ల మధ్య నుంచే రోడ్... అక్కన్నపేట వరకు హ్యామ్ రోడ్డు

సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు:  హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇక అరగంటలోనే చేరుకోవచ్చు. ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైన ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 40 కి.మీ ఉండగా రాజీవ్​రహదారి పోనూ మిగిలిన 20 కి.మీ ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణానికి రూ.163.20కోట్లు మంజూరయ్యాయి.

ఈ పనులు రెండు ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా విభజించగా.. ఫేజ్ 1 కింద కొత్తపల్లి నుంచి సుందరగిరి వరకు 10కి.మీకు రూ.86కోట్లు, ఫేజ్ 2 కింద సుందరగిరి నుంచి హుస్నాబాద్ వరకు 10 కి.మీ రూ.77.20కోట్లు కేటాయించారు. కాగా ఫేజ్ 2 పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఫేజ్ 1 పనులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి. 

100 ఫీట్లకు పెరగనున్న రోడ్డు 

హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు ప్రస్తుతం 60 ఫీట్ల రోడ్డు ఉండగా.. దానిని 100 ఫీట్లకు పెంచడంతోపాటు ఐదు ఫీట్ల వెడల్పుతో డివైడర్ నిర్మించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు ప్రతిపాదనలకు పరిమితం కాగా గతేడాది జూన్ 27న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఫేజ్ టూ పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవలే నిధులు మంజూరు కావడంతో విస్తరణ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే కేవలం అరగంటలోపే హుస్నాబాద్ నుంచి కరీంనగర్ చేరుకునే వీలు కలుగుతుంది. 

ఊర్ల మధ్య నుంచే రోడ్

హుస్నాబాద్ నుంచి కరీంగనర్ ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు పలు గ్రామాల నుంచి సాగనుంది. ఈ మార్గంలోని  కొండాపూర్, సుందరగిరి, చిగురుమామిడి, చిన్న ముల్కనూర్ గ్రామాలు ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో  కొన్ని గ్రామాల్లోని  నివాస భవనాలు కూల్చే అవకాశం ఉండడంతో ప్రత్యమ్నాయాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.  చిగురుమామిడి మండల కేంద్రంలో ఎక్కువ ఇళ్లు కూలగొట్టాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తుండగా సుందరగిరి జీపీ మాత్రం ఊర్లో నుంచే ఫోర్ లేన్ నిర్మించాలని ఇప్పటికే తీర్మానించారు. కాగా చిగురుమామిడిలో బైపాస్ వేస్తారా లేక ఊర్లో నుంచే తీసుకెళ్తారా అన్నది ఇంకా ఖరారు కాలేదు. 

అక్కన్నపేట వరకు హ్యామ్ రోడ్డు

హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 10 కిలోమీటర్ల మేర ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హ్యామ్ విధానంలో రోడ్డు నిర్మాణానికి రూ.58.91 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు కూడా టెండర్ దశలో ఉన్నాయి. హుస్నాబాద్ నుంచి జిల్లా కేంద్రమైన జనగామ వరకు ఫోర్ లేన్ రహదారిని విస్తరించనున్న నేపథ్యంలో అక్కన్నపేట వరకు పనులు చేపట్టనున్నారు.

జనగామ వరకు ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తయితే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హుస్నాబాద్ నుంచి విజయవాడ, సూర్యాపేట, తిరుపతి వెళ్లేవారి ప్రయాణం మరింత సులభం కానున్నాయి. హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు త్వరలోనే ఫోర్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు ప్రారంభించనున్నారు.