IPL New Rules: ఇండియన్ ప్రీమియర్ లీగ్19వ సీజన్ చప్పగానే కొనసాగుతుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు జరిగిన 14 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కానీ ఈ సీజన్ కొనసాగుతుండగానే టోర్నమెంట్లో కొత్త రూల్ ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. పలు నిబంధనలను కఠినతరం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో, అవుట్అయ్యే టైంలో ఫిజియోలు, కోచ్‌లే కాకుండా బెంచ్ కే పరిమితమైన ప్లేయర్లు సైతం స్టేడియంలోకి వస్తున్నారు. అప్పుడప్పుడు ఓవర్‌కు ఓవర్‌కు మధ్యలోనూ మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో ముచ్చటిస్తున్నారు. దీంతో సమయం వృథా అవుతోంది.. అందుకే గ్రౌండ్ లోకి ప్లేయర్స్ ప్రవేశానికి సంబంధించి ఒక రూల్ ను అమలు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.
కొత్త రూల్స్ ప్రకారం, మ్యాచ్ జరిగే సమయంలో జట్టులో పేరున్న ప్లేయర్స్ మాత్రమే స్టేడియంలోకి పర్మిషన్ ఇస్తారు. ఈ లిస్ట్‌లో 16 మంది ఆటగాళ్ల పేర్లను చేర్చుకోవచ్చని పేర్కొనింది. ప్రతి టీమ్ 16 మంది ప్లేయర్లతో కూడిన లిస్ట్‌ను టాస్ తర్వాత అందజేయాలి.. ఇందులో 11 మంది ప్లేయింగ్ ఎలెవన్ తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా సెలక్ట్ చేసుకుంటారు. మిగిలిన నలుగురిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేయాలని తెలిపింది. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ ఆటగాళ్లతో పాటు, లిస్ట్‌లో ఉన్న ఐదుగురే బౌండరీ లైన్ దగ్గర ఉండటానికి అనుమతి ఇస్తామని బీసీసీఐ చెప్పుకొచ్చింది.
ఇక బెంచ్ లో ఉన్న వాళ్లంతా బిబ్ (Bibs)లు ధరించి ఉండాలని బీసీసీఐ సూచించింది. విరామ సమయంలో కోచ్‌లతో సహా ఇతర సిబ్బందిని స్టేడియంలోకి వచ్చేందుకు పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నట్లు బోర్డు చెప్పుకొచ్చింది. అలాగే టీమ్ లిస్ట్‌లో లేని ప్లేయర్స్ మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లకి డ్రింక్స్, బ్యాట్లు లేదా గ్లౌజులు ఇవ్వడానికి కూడా అనుమతి లేకపోవడం, బిబ్స్ ధరించిన ఆటగాళ్లను మాత్రమే బౌండరీ లైన్ చుట్టూ తిరిగేందుకు అనుమతిస్తారు. వాళ్లనే మైదానంలోకి కూడా రానిస్తారని తెలిపింది. ఇక మిగిలిన ఆటగాళ్లందరూ డగౌట్‌లోనే ఉండాలని వెల్లడించింది.
ఈ కొత్త రూల్ ని ఆర్టికల్స్ 11.5.2, 24.1.4 ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ నిబంధన 11.5.2 ప్రకారం, అంపైర్ పర్మిషన్ లేకుండా మైదానంలోకి డ్రింక్స్ తీసుకురావడం, టైమ్ వృథా చేయడం రూల్స్ కి విరుద్ధం. కానీ, మ్యాచ్‌ల సమయంలో క్రమశిక్షణను పాటించడం, సమయం వృథా కాకుండా ఉండటానికే, స్టేడియంలో అనవసరమైన రద్దీని తగ్గించి ఆటను వీలైనంత స్పీడ్ గా పూర్తి చేయాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్ఉటకున్నట్లు తెలుస్తుంది. ఈ నియమాలను పాటించకపోతే ఆయా జట్లపై లేదా ప్లేయర్స్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
