గంగూలీ కుటుంబంలో మరొకరికి కరోనా

గంగూలీ కుటుంబంలో మరొకరికి కరోనా

టీమిండియా మాజీ కెప్టెన్, BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబంలో మరొకరు కరోనా బారి పడ్డారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన గంగూలీ.. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు గుంగూలీ కూతురు సనా గంగూలీకి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా లక్షణాలు ఉండడంతో దాదా కూతురు సనా గంగూలీ ఇవాళ (జనవరి 5) టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.

అయితే.. తేలికపాటి లక్షణాలు ఉండడంతో సనా ఇంట్లోనే ఐసోలేషన్ అయ్యారు. సనాతో పాటు గంగూలీ మామ దేబాశిష్ గంగూలీ, కజిన్ షువ్రోదీప్ గంగూలీ, కోడలు జాస్మిన్ గంగూలీకి కూడా పాజిటివ్ అని తేలినట్లు  సమాచారం. అయితే అందరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట. వరుసగా అందరూ వైరస్ బారిన పడుతుండడంతో దాదా ఫ్యామిలీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీలో మళ్లీ తగ్గుతున్న ఎయిర్ క్వాలిటీ