ఢిల్లీలో మళ్లీ తగ్గుతున్న ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో మళ్లీ తగ్గుతున్న ఎయిర్ క్వాలిటీ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చలిగాలులకు తోడు వర్షం కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 369గా నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఢిల్లీలో మూడ్నాలుగు రోజులుగా కాస్త తగ్గినట్టు అనిపించినా.. చలి పులి మళ్లీ పంజా విసురుతోంది. చలి తీవ్రతను తట్టుకోలేక జనం చలి మంటలు వేసుకుంటున్నారు. మరికొన్ని రోజులు చలిగాలులు వీస్తాయని, ఈ నెల 9వ తేదీ వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.

మరిన్ని వార్తల కోసం: 

బూస్టర్ డోసుగా చుక్కల మందు టీకా!

నిరాశలో ప్రభాస్ అభిమానులు

మిషన్ భగీరథ నీళ్లతో స్నానం చేయిస్తాం