బూస్టర్ డోసుగా చుక్కల మందు టీకా!

బూస్టర్ డోసుగా చుక్కల మందు టీకా!

హైదరాబాద్: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా అనుమతి అంశాన్ని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. ఈ చుక్కల మందు టీకాను బూస్టర్ డోసు కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని డీసీజీఐకి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. అవసరమైన పత్రాలు, క్లినికల్ ట్రయల్ వివరాలు సమర్పించాలని డీసీజీఐకి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రెండు డోసుల కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు తీసుకున్న వారికి బూస్టర్ డోస్ కింద చుక్కల మందు టీకా అనువైనదని భారత్ బయోటెక్ పేర్కొంది. 

ఇకపోతే, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో బూస్టర్ డోసులపై అనేక దేశాలు దృష్టి సారించాయి. అందువల్ల చుక్కల మందు టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. దాదాపు 500 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించాలని భారత్ బయోటెక్ యోచిస్తోంది. అయితే రెండు డోసులు తీసుకున్న తర్వాత 6 నుంచి 9 నెలల వ్యవధిలో బూస్టర్ డోస్ తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా చుక్కుల మందు అందుబాటులోకి తీసుకురావాలని భారత్ బయోటెక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫారసు, డీసీజీఐ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. 

మరిన్ని వార్తల కోసం: 

నిరాశలో ప్రభాస్ అభిమానులు

ఇద్దరు లేడీ డాక్టర్ల పెళ్లి.. కారణం అదే

టికెట్ల రేట్లను సినిమా ఖర్చును బట్టి నిర్ణయించరు