Good Health : వ్యాయామం చేసే ముందు ఇవి తినచ్చొ.. తినకూడదా..!.

Good Health : వ్యాయామం చేసే ముందు ఇవి తినచ్చొ.. తినకూడదా..!.

వ్యాయామం చేసేముందు కొందరు ఆహారం తీసుకుంటారు. అయితే అనారోగ్యకర ఆహారం తినడం వల్ల పొట్ట బరువుగా అవుతుంది. దాంతో వ్యాయామం చేయడం కష్టమవుతుంది. అందుకని వ్యాయామం చేసేందుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే శరీరాన్ని తేలికగా ఉంచే ఆహారాన్ని తినాలి.

 వ్యాయామానికి ముందు జ్యూస్  తో పాటు, కొంచెం స్నాక్స్ తినటం మంచిదే. మోతాదు మించితేనే కష్టం అవి జీర్ణం అవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పొట్ట ఉబ్బరంగా అనిపించి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని వ్యాయామాలకు ముందు అధిక మొత్తంలో వీటిని తినడం మంచిది కాదు.

చాలా మంది ప్రొటీన్ బార్లు తినటానికి ఇష్టపడతారు. కానీ ప్రొటీన్​ బార్​ ల  గురించి రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అవేంటంటే.. ఇవి ఆరోగ్యకర కార్బోహై డ్రేట్లను కలిగి ఉండవు. వ్యాయామాలు చేసేందుకు సరిపోయే శక్తిని అందించలేవు .  కాగా మరోవిషయం... వీటిలో చక్కెరలు అధికంగా ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఒక ప్రొటీన్​ బార్ లో కనీసం 1.8 గ్రాముల గింజధాన్యాలు ఉండాలి అప్పుడు శక్తి ఆలస్యంగా శరీరానికి అందుతుంది.

ఫ్రెంచ్ ప్రై..నూడెల్స్.. తిని శరీరంలోకి పంపిన కెలోరీల ను తగ్గించుకోవటానికి జిమ్​ కు వెళ్ళేటపుడు అవకాడో ను  కూడా వెంట తీసుకెళతారు. కానీ ఇది చాలా తప్పు ఎందుకంటే అవకాడోలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. రక్త సరఫరాకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అవకాడో ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను కూడా కలిగి ఉంటాయి. కానీ వ్యాయామం చేయబోయే ముందు వీటిని తినటం సరికాదు.

కార్బోనేటేడ్ డ్రింక్స్ అంటే శీతలపానీయాలు, సోడా వంటివి కడుపులో ఇబ్బంది కలిగిస్తాయి. వీటిలో చక్కెరలు అధికంగా ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. వీటితో పాటు కాండీ బార్స్​ కూడా అధికంగా చక్కెరను కలిగి ఉంటాయి. ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిస్తాయి.

కాబట్టి వ్యాయామం చేసేముందు ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసుకుని జాగ్రత్తపడాలి. అప్పుడే చేసిన దానికి ఫలితం ఉంటుంది.