V6 News

రంగుల జ్యోతిష్యం:  ఏ రాశి వారు ఎలాంటి రంగు వస్తువులు వాడాలి..!

రంగుల జ్యోతిష్యం:  ఏ రాశి వారు ఎలాంటి రంగు వస్తువులు వాడాలి..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..  ప్రతి రాశికి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు. ఆ గ్రహాన్ని బట్టి అదృష్ట రంగులు నిర్ణయించబడతాయి. సరైన రంగు వస్తువులు, దుస్తులు వాడటం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు 12 రాశుల వారు ఎలాంటి రంగుల వస్తువులు ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . ! 

మేష రాశి: ఈ రాశికి అధిపతి  కుజుడు.  వీరికి  ఎరుపు, నారింజ రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్‌ను .. ఏకాగ్రతను  పెంచుతాయి.

వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రడు.  ఈ రాశి వారికి తెలుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   లేత గులాబీ.. ఆకుపచ్చ రంగుల వస్తువులు  కూడా జ్యోతిష్య పరంగా  చాలా  ఉపయోగకరంగా ఉంటాయి.  ఈ రంగులకు చెందిన వస్తువులను ఎక్కువుగా ఉపయోగించడం వలన జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశం ఉంది. 

మిథున రాశి:  ఈ రాశికి అధిపతి   బుధుడు.   పసుపు, ఆకుపచ్చ రంగులు ఈ రాశి వారికి  బాగా అనుకూలిస్తాయి.  ఈ రంగులు ధరిస్తే కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. క్రమేణ సమస్యలు పరిష్కారం అవుతాయి. 

కర్కాటక రాశి: ఈ రాశికి అధిపతి  చంద్రుడు  . వీరికి సిల్వర్, క్రీమ్. లేత  రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులను వీరు ధరించడం వలన శుభ ఫలితాలను చూస్తారు. సానుకూల మార్పులు కలుగుతాయి.

సింహ రాశి: ఈ రాశికి అధిపతి  సూర్యుడు.  ఈ రాశి వారి అన్ని విషయాల్లో శుభం కలగాలంటే ఎక్కువుగా  గోల్డ్​ రంగు వస్తువులు వాడితే బాగా కలిసి వస్తుంది,  ఇంకా ఆరెంజ్​, ఎరుపు రంగు  వస్తువులు వాడితే ఆకర్షణీయంగా ఉంటారు. 

కన్య రాశి: ఈ రాశికి అధిపతి బుధుడు.  ఈ రాశి వారికి లేత ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. జీవితంలో స్థిరత్వాన్ని కూడా పొందుతారు.

తులా రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు.  ఈ రాశి వారు గోచార రీత్యా నీలం రంగు వస్తువులు వాడాలి.  అలాగే తెలుపు, లేత గులాబీ రంగులు వాడితే సంతోషంగా గడుపుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి: ఈ రాశికి అధిపతి  కుజుడు ముదురు ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. అదృష్టం  పెరుగుతుంది.నలుపు, మెరూన్​ రంగులు  ఈ రాశి వారికి రిలేషన్‌షిప్  ను వృద్ది చేస్తాయి.

ధనుస్సు రాశి:ఈ రాశికి అధిపతి బృహస్పతి.  ధనుస్సు రాశి వారికి ముదురు పసుపు, లేత రంగులు, ఊదా రంగులు  బాగా కలిసి వస్తాయి. సానుకూలంగా ఆలోచిస్తారు. చక్కటి మార్పులను చూస్తారు.

మకర రాశి:ఈ రాశికి అధిపతి  శని దేవుడు.  ఈ రాశి వారు  నలుపు, డార్క్ గ్రే రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగు వస్తువులు ఎక్కువుగా వాడటం వలన  సహనం, స్థిరత్వాన్ని పెంపొందించుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి: ఈ రాశికి  అధిపతి శని భగవానుడే. ముదురు నీలం రంగు బాగా కలిసి వస్తుంది.  ఇంకా ఆకుపచ్చ.. నీలం మిశ్రమం రంగులకు చెందిన వస్తువులను వాడటం వలన బాగా ఆలోచించి.. మంచి నిర్ణయాలు తీసుకుంటారని పండితులు చెబుతున్నారు. 

మీన రాశి: ఈ రాశికి అధిపతి  బృహస్పతి . ఈ రాశి వారు  పసుపు, సముద్రం రంగులో ఉండే ఆకుపచ్చ రంగులు కలిగిన వస్తువులను ఉపయోగిస్తే  ప్రశాంతత పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.