మనుషులు అందరూ ఒకే రకంగా జన్మించినా.. అందరి జీవత్వం ఒక రకంగా ఉండరు. ఒక్కొక్కరు కలా ఉంటారు. అంతేకాదు ప్రతి జీవి ఒకరకంగా ఉండదు. అసలు జీవుడు దేహంలోకి ఎలా ప్రవేశిస్తాడు.. ఆ జీవి అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి.. జీవుడు వాసనలు ఎలా తగిలించుకుంటాడు? ఈ విషయం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి.. పండితులు ఏమంటున్నారు. జీవి ప్రవర్తన వెనుక ఆధ్యాత్మికరహస్యం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
ప్రతి జీవి కూడా తల్లి గర్భం నుంచి జన్మిస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ జీవుడు తల్లి గర్భంలోకి ఎలా చేరుతాడనే విషయం గురించి పురాణాల్లో స్పష్టంగా రుషులు పేర్కొన్నారు. జీవుడు గత జన్మల వాసనల ప్రకారం ఏ జీవి దేహంలోకి వెళ్లాలి అనే విధంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
జీవుడు తన తండ్రి తినే ఆహారం ద్వారా అతని శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత శుక్రకణం ద్వారా తల్లి గర్భంలోకి చేరి అక్కడే తొమ్మిది నెలల పాటు ..అక్కడే గత జన్మల వాసనలు నెమరేసుకుంటూ పెరిగి.. తరువాత ఈ లోకంలో జన్మిస్తాడు. పుట్టినప్పుడు అతనికి ఈ జన్మలోని సంబంధాల గురించి ఎలాంటి జ్ఞాపకం ఉండదు కానీ..భూమిపైకి వచ్చేటప్పుడు మాత్రం ఖాళీగా రాడు. గత జన్మల సంస్కారాలు, వాసనలు సూక్ష్మరూపంలో అతనితో ఉంటాయని శాస్త్రాలు చెబుతాయి.
పుట్టిన తర్వాత జీవుడు చూసే దృశ్యాలు,వినే మాటలు, తినే ఆహారం, చేసే పనులు, కలిసే మనుషులు, అనుభవించే సుఖదుఃఖాలు అన్నీ మనస్సులో ముద్రలు వేస్తాయి. ఆ ముద్రలే సంస్కారాలుగా మారుతాయి.
ఒకే విషయాన్ని పదేపదే ఆలోచించడం వల్ల అది మమకారంగా మారుతుంది. ఆ మమకారం బలపడితే అదే వాసన అవుతుంది. ఈ వాసనే మరణం తరువాత కూడా జీవునితో పాటు కొనసాగుతాయి.
ఉదాహరణకు ఒక దంపతులు ప్రేమతో వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి భార్య గర్భవతి అయిందని తెలిసింది. అప్పటివరకు కేవలం భర్త, భార్య మాత్రమే ఉన్నారు. గర్భం ఉందని తెలిసిన క్షణం నుండి ఇంకా పుట్టని బిడ్డపై ప్రేమ మొదలవుతుంది.
►ALSO READ | నీతికథ : స్వామి బోధన .. ఇతరులను బ్లాక్మెయిల్ చేస్తే ఎప్పటికైనా క్షమాపణ కోరాల్సిందే..!
నెలలు గడిచే కొద్దీ ఆ ప్రేమ పెరుగుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రేమ మరింత బలపడుతుంది. బిడ్డ నడవడం, మాట్లాడడం, చదవడం, ఎదగడంప్రతి దశలో తల్లిదండ్రుల మమకారం పెరుగుతూనే ఉంటుంది. ఈ ప్రేమ జీవితాంతం కొనసాగుతుంది.మరణ సమయంలో కూడా మనస్సు అదే బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటే, ఆ మమకారం వాసనగా జీవునితో పాటు ఉంటుంది. అందువల్ల ఆ జీవుడు ఆ బంధాన్ని వెంటనే విడిచిపెట్టలేడు. ఇదే భావాన్ని భగవద్గీతలో కూడా "అంత్యకాలంలో ఏ భావంతో శరీరాన్ని విడిచిపెడతాడో, ఆ భావానికే సంబంధించిన గతి పొందుతాడు" అని వివరిస్తుంది.
ధనం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. జీవితమంతా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని, "నా డబ్బు, నా సంపద" అనే భావంతో జీవించిన వ్యక్తి మరణ సమయంలో కూడా అదే ఆలోచనలో ఉంటే, ఆ ధనాసక్తి వాసనగా కొనసాగుతుంది.ఆస్తి విషయంలో కూడా అలాగే. "ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ భూమి నాది" అనే భావం ఎంత బలంగా ఉంటే, అంత బలమైన మమకారం ఏర్పడుతుంది.
శరీరం పోయినా ఆ భావన వెంటనే పోదు అని వేదాంతం చెబుతుంది.అధికారం, పేరు, కీర్తి, పదవి, కుటుంబం, స్నేహితులు, శత్రుత్వం, కోపం, కామం, లోభం...ఏది ఎక్కువగా మనస్సులో నిలిచిపోతుందో అదే వాసనగా మారుతుంది.
చిన్నప్పటి నుండి సంగీతంపై ప్రేమ పెంచుకున్న వ్యక్తికి సంగీత వాసన బలంగా ఉంటుంది.ఎప్పుడూ దైవస్మరణ చేసే భక్తునికి భక్తి వాసన ఏర్పడుతుంది.మద్యానికి బానిసైనవాడికి ఆ వ్యసన వాసన కొనసాగుతుంది.సేవాభావంతో జీవించినవాడికి దయ, కరుణ వాసనలు బలపడతాయి.ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసినవాడికి సేవాసంస్కారం కొనసాగుతుంది.ఎప్పుడూ జ్ఞానాన్ని కోరుకున్నవాడికి జ్ఞాన వాసన పెరుగుతుంది.భోగాలపైనే మనస్సు నిలిపినవాడికి భోగవాసన బలపడుతుంది
అందుకే వస్తువులను ఉపయోగించాలి కానీ వాటిపట్ల బంధం పెంచుకోకూడదు. కుటుంబాన్ని ప్రేమించాలి కానీ అది బంధనంగా మారకూడదు. ధనాన్ని సంపాదించాలి కానీ ధనదాసుడిగా మారకూడదు. ఆస్తిని కాపాడాలి కానీ "ఇదే నేను" అనే అహంకారం పెంచుకోకూడదు.
ఒక గుడ్డ ముక్కలో ఎండిపోయిన చేపలను మూట కట్టి ఓ నాలుగు రోజులు ఉంచండి. అ తరువాత ఎండు చేపలనిఆ గుడ్డ నుండి చేపలని తీసివేయండి. ఆ వాసన కొన్ని రోజులు అలాగే ఉంటుంది. ఆ గుడ్డ ముక్కకు ఎంత ఉతికినా ఆ చేపల వాసన పోదుచాలా రోజులకు ఆ వాసన పోతుంది . శుభ్రం చేయగా చేయగా పోతుంది.
మరి జీవుడు కొన్ని కోట్ల జన్మల నుండి ఇ దేహాలనీ పొందుతూ విడిచిపెడుతూ ఎన్నో జన్మలు ఎత్తుతూ తిరుగుతూ ఉంటున్నాడు. అంత తొందరగా ఈ దేహ వాసన జీవుడికి పోతుందా జీవుడికి దేహ వాసన పోవాలి అంటేఎన్ని రోజులు శుభ్రం చేయాలిశుభ్రపరిచే వస్తువు ఏది ?
అదే భగవద్గీత, పురాణాలు,వేదములు, ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భాగవతం అలవాటు చేయాలి. మమకారం ఎంత తక్కువగా ఉంటే మనస్సు అంత స్వేచ్ఛగా ఉంటుంది. మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే వాసనలు అంత క్షీణిస్తాయి. వాసనలు క్షీణించినప్పుడు జననమరణ చక్రం నుండి విముక్తి పొందే మార్గం సులభమవుతుంది.
అందువల్ల ప్రతి మనిషి తనను తాను ప్రశ్నించుకోవాలి "నేను ఏమి తీసుకెళ్తాను?" శరీరాన్ని కాదు, ధనాన్ని కాదు, ఆస్తిని కాదు, బంధువులను కాదు. తనతో వెళ్లేది తాను పెంచుకున్న సంస్కారాలు, వాసనలు మాత్రమే అని వేదాంతం బోధిస్తుంది. కాబట్టి ప్రేమను పవిత్రంగా ఉంచాలి, కర్తవ్యాన్ని నిష్కామంగా చేయాలి, మమకారాన్ని తగ్గించాలి, దైవస్మరణను పెంచాలి. అప్పుడు వాసనలు క్రమంగా క్షీణించి జీవుడు పరమశాంతి వైపు పయనిస్తాడు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
