V6 News

రివర్స్ గుండె.. కుడి నుంచి ఎడమకు మార్చారు.. ఇండియా డాక్టర్ల అద్భుతం

రివర్స్ గుండె.. కుడి నుంచి ఎడమకు మార్చారు.. ఇండియా డాక్టర్ల అద్భుతం

మన శరీరంలో గుండె ఎటువైపు ఉంటుంది ? ఎడమ వైపు ఉంటుంది అనే ఆన్సర్.. సరైంది ..కానీ కొందరికి “కుడివైపు” కూడా  గుండె ఉంటుంది. ఈ విచిత్రమైన ఆరోగ్య సమస్యను డెక్స్‌ట్రోకార్డియా (Dextrocardia)  అంటారు. ఈ అరుదైన ప్రాబ్లమ్ ప్రతి 10,000 మందిలో ఒకరికి మాత్రమే పుట్టుకతో వస్తుంటుంది.

డెక్స్‌ట్రోకార్డియా కారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD)తో బాధపడుతున్న బంగ్లాదేశ్ వ్యక్తి 47 ఏళ్ళ యేషిన్ భుయాన్ కు బెంగుళూరులోని నారాయణ హెల్త్ సిటీ వైద్య నిపుణులు సక్సెస్ ఫుల్ గా కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ (CABG) చేశారు. అతడికి కుడివైపున  గుండె ఉన్నందున.. ఛాతీకి  కుడి వైపున 5 సెంటీమీటర్ల  మేర కట్ చేసి   ఈ సర్జరీ నిర్వహించారు.  ఎముకలను డిస్టబ్ చేయకుండానే ...  పక్కటెముకల మీదుగా గుండెను యాక్సెస్ చేసి ఈ సర్జరీని వైద్యులు పూర్తి చేశారు.

కుడివైపు గుండెను  కలిగిన వారికి కీహోల్  సర్జరీ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీంతో కుడి వైపునున్న అతడి గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి కరోనరీ ధమనులు ఇన్నాళ్లు  పడిన కష్టానికి తెరపడింది. భూయాన్‌ కు (47)  ఈ  సర్జరీ చేసిన.. నాలుగు గంటలకే వెంటిలేటర్ తొలగించారు.  ఐదు రోజుల్లోనే డిశ్చార్జ్ కూడా  చేశారు.

డెక్స్ట్రోకార్డియా వ్యాధి రావడానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. వంశపారపర్యంగా  జన్యు లోపాల వలన ఈ వ్యాధి వస్తుంది. డెక్స్ట్రోకార్డియా అంటే ఛాతీ, పొట్టలో ఉన్న భాగాలు పుట్టుకతోనే రివర్స్ లో ఉంటాయి.  ఇప్పుడు ఈ రోగికి గుండె తిరగబడిందని వైద్యులు తెలిపారు.  జన్యు లోపాలతో జన్మించిన వారికి ఊపిరితిత్తులు, కడుపు, కాలేయం తిరగబడే అవకాశం ఉంది.   గుండె ,  ఇతర అవయవాలు రివర్స్ లేదా మిర్రర్ ఇమేజ్ స్థానంలో ఉంటే దీనిని సిటస్ ఇన్‌వర్సెస్‌తో కూడిన డెక్స్‌ట్రోకార్డియా అంటారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిగా  మినిమల్లీ ఇన్వాసివ్ పద్దతిలో సర్జరీ చేసినట్లు బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీ సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రఘు తెలిపారు.   కార్డియాక్ సర్జరీలో అద్భుతాన్ని బెంగళూరు వైద్యులు సాధించారు.   పేషంట్ భూయాన్ ఆరు నెలలుగా ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు.  పైగా అతనికి మధుమేహం కూడా ఉంది.   వైద్య భాషలో  డెక్స్ట్రోకార్డియా అనే వ్యాధితో బాధపడుతున్నాడని ఎక్స్ రే లో నిర్ధారణఅయిందని వైద్యులు తెలిపారు.   ఈ వ్యాధి గుండెకు సంబంధించినదని వైద్యులు తేల్చారు.