ఇవాళ్టి నుంచి బెంగళూరులో వైమానిక ప్రదర్శన

ఇవాళ్టి నుంచి బెంగళూరులో వైమానిక ప్రదర్శన

బెంగళూరు : ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. నేటి నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది. 14వ ఏరో ఇండియా షోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

ఎయిర్‌ షోలో 98 దేశాలకు చెందిన 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో వైమానిక ప్రదర్శన చూసేందుకు పబ్లిక్ కు అవకాశం కల్పించనున్నారు. ఎంట్రీ టికెట్‌ను రూ.1000గా నిర్ణయించారు.

భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. వీటిలో ఎయిర్‌బస్‌, బోయింగ్‌, లాక్హీడ్‌, మార్టిన్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌, ఆర్మీ ఏవియేషన్‌, హెచ్‌సీ రోబోటిక్స్‌, సాబ్‌, సఫ్రాన్‌, సాబ్‌, సఫ్రాన్‌, రోల్స్‌ రాయిస్‌, ఎల్‌ అండ్ టీ, భారత్‌ పోర్జ్‌ లిమిటెడ్‌, హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, బీఈఎంఎల్‌ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి.