ఎంత పద్దతో కదా : మీరు మా ఇంటి ముందు కారు పెట్టొద్దంటూ లేఖ

ఎంత పద్దతో కదా : మీరు మా ఇంటి ముందు కారు పెట్టొద్దంటూ లేఖ

మీరు బెంగళూరులో ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారా.. అయితే ముందు ఇల్లు.. వాహనాల పార్కింగ్ కు స్థలం దొరికిన తరువాతనే ఉద్యోగంలో చేరండి. లేదంటే మీకు తిప్పలు తప్పవు. ఇరుగుపొరుగు వారి నుంచి అనుకోని నోటీసులు కూడా వచ్చే అవకాశం ఉంది.  

 బెంగళూరులో సగానికిపైగా జనం బయటి ఊళ్ల నుంచి వలస వచ్చిన వాళ్లే ఉంటారు. అందుకే  కాస్మోపాలిటన్​ నగరంగా పిలుస్తారు.  అక్కడ అంతలా పాతుకుపోయిన ఐటీహబ్​. దేశంలో బెంగళూరును ఐటీ రాజధానిగా పిలుస్తుంటారు. అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలకూ కొదవే లేదు. అందుకే బెంగళూరుకు ఇతర ప్రాంతాల వారు క్యూ కడుతున్నారు. అందుకే ఈ నగరంలో ఇల్లు దొరకాలంటే  ఇల్లు అద్దె్కు దొరకాలంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది.  ఒకవేళ ఇల్లు దొరికినా కారు పార్క్ చేయాలంటే చాలా కష్టాలు అనుభవించాలి. ఈ నగరంలో ఒక చోట నివాసం ఉంటూ.. మరో చోట కారు పార్కింగ్ చేస్తుంటారు.  అలా కారు పార్క్ చేసిన కారు యజమానికి పొరుగు వారు షాక్ ఇచ్చారు. కారుపై Please do not park your car here అని నోటీసు ఇచ్చి కింద yours faithfully అంటూ your neighbour అని ఒక నోటీసును కారుపై అంటించారు. కారు యజమాని పొరుగు వారి స్థలాన్ని ఆక్రమించకూడదని  మర్యాద పూర్వకంగా హెచ్చరించిన నోటీసు  ప్రస్తుతం ట్వట్టర్ లో వైరల్ అయింది.  

బెంగళూరు సిలికాన్ వ్యాలీ లో ఆన్ లైన్  పరిశీలించే వీక్షకులకు ఈ ట్వీట్ ఆకర్షణీయమైన అంశంగా మారింది.  ట్విటర్ పోస్ట్‌లో  వినియోగదారుడు  సుభాసిస్ దాస్ కోరమంగళలోని కారు కిటికీలో కనిపించిన మర్యాద  పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ తనకు దొరికిన నోట్ ఫోటోను పోస్ట్ చేశారు. “హాయ్. దయచేసి మీ కారును ఇక్కడ పార్క్ చేయవద్దు!! మేము ఇంతకు ముందు అలా చేయవద్దని మిమ్మల్ని ఇప్పటికే అభ్యర్థించారు.   మేము 2000 సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని ....  రెండు  కార్లను కలిగి ఉన్నామని అర్థం చేసుకోండి. కాబట్టి, మాకు పార్కింగ్ స్థలం కావాలి. దయచేసి మీ మునుపటి పార్కింగ్ ప్రదేశానికి తిరిగి వెళ్లండి. మనం మంచిగా  పొరుగువారిగా ఉందాం." "మీ పొరుగువారు" అనే పదాలతో నోట్‌పై సంతకం చేయబడింది.

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అయింది.  నెటిజన్ల నుంచి విభిన్నమైన స్పందనలు వచ్చాయి. బెంగుళూరు నివాసితులు ఉద్రిక్త పరిస్థితులను చక్కగా నిర్వహించారని పలువురు ప్రశంసించినప్పటికీ..  ఢిల్లీ-ఎన్‌సీఆర్ నివాసితులు ఈ ట్వీట్ పై వారి అభిప్రాయాలను పోస్ట్ చేయడంతో యుద్ధభూమిగా మారింది. ఢిల్లీ లేదా గుర్గావ్ నివాసి ఇలాంటి పరిస్థితిలో ఎలా స్పందిస్తారో వారు వ్యక్తం చేశారు. "ఇదే గుర్గావ్‌లో జరిగి ఉంటే, పొరుగువారు ఇప్పటికే బేస్‌బాల్ బ్యాట్‌తో విండ్‌షీల్డ్‌ను పగలగొట్టి ఉండవచ్చు" అని ఒక వినియోగదారుడు  వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారు ఒక ఇబ్బందికరమైన సంఘటనను పంచుకున్నారు, " ఇలా నోటీసు పెట్టడం చాలా మంచిదంటూ .. నా స్నేహితుడు పొరుగు ఇంటి దగ్గర కారు పార్కింగ్ చేస్తే  అతని కారుపై వారు  సాంబార్ పోశారంటూ ...బెంగళూరు ప్రజలు మధురంగా ​​ఉంటారని  ట్వీట్ చేశారు.  

ఏది ఏమైనా బెంగళూరులో ఉద్యోగం చేయాలంటే ముందు ఇల్లు.. ఆ తరువాత వారి వాహనాలకు సరిపడ పార్కింగ్ స్థలం దొరికినప్పుడే కాస్మోటిక్ నగరంలో ఉద్యోగం చేయాలి.  ఈ వార్త చదివిన తరువాత పేరు గొప్ప ...ఊరు దిబ్బలా .. బెంగళూరు నగరం తయారైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.