బెంగళూరులో జాంబీ డ్రగ్స్ అంటూ కలకలం: ఉన్న టెన్షన్స్ చాలక.. కొత్తగా ఇదేందయ్యా ఇది..!

బెంగళూరులో జాంబీ డ్రగ్స్ అంటూ కలకలం: ఉన్న టెన్షన్స్ చాలక.. కొత్తగా ఇదేందయ్యా ఇది..!

అది ఓ కాలేజ్ పరిసర ప్రాంతం. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓ యువకుడు రోడ్డుపై నిలబడ్డాడు. మనుషులు అన్నాక రోడ్డుపై నిలబడటం కామనే కదా ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటాన్నారా.. ఆ  యువకుడు రోడ్డుపై 10 నిమిషాలో 20 నిమిషాలో నిల్చుంటే నో ప్రాబ్లమ్. కానీ గంటల తరబడి అలాగే నిలబడి ఉన్నాడు. స్పృహ ఉంది కానీ మనిషిలో చలనం లేదు. కండు తెరిచి చూస్తున్నాడు కానీ మాట్లాడటం లేదు. ఎవరూ పిలిచిన పలకడం లేదు. అసలు ఉలుకు పలుకు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యువకుడు రోడ్డుపై విగ్రహంలా నిలబడ్డాడు. 

అచ్చం  సినిమాల్లో చూపించే జాంబి మాదిరిగా రోడ్డుపై ఒకే పొజిషన్ లో గంటల తరబడి కదలకుండా మెదలకుండా నిల్చున్నాడు. దీంతో ఆ యువకుడి ప్రవర్తన చూసి పక్కవారు హడలిపోయారు. కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు అది జాంబీ డ్రగ్ ఎఫెక్ట్ అంటున్నారు. జాంబీ డ్రగ్ తీసుకున్న వారే అలా ప్రవర్తిస్తారని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడి జరిగింది.. ఇతర వివరాలు ఏంటో తెలుసుకుందాం. 

బెంగళూర్‎లోని బాగలూర్ ప్రాంతంలోని ఓ కాలేజీ సమీపంలో ఓ యువకుడు రోడ్డుపై గంటల తరబడి నిల్చున్నాడు. స్పృహ ఉంది కానీ మనిషిలో చలనం లేదు. కదలడం లేదు మెదలడం. ఎవరూ పిలిచినా పలకడం లేదు. చూస్తున్నాడు కానీ మాట్లాడటం లేదు. ఓ స్టాట్చ్యూ మాదిరిగా ఒకే పొజిషన్‎లో కొన్ని గంటల పాటు రోడ్డుపై నిలబడిపోయాడు. ఆ యువకుడి పరిస్థితిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జాంబీ డ్రగ్ ఎఫెక్ట్ వల్లే యువకుడు అలా ప్రవర్తిస్తున్నాడని.. జాంబీ డ్రగ్ బెంగళూర్ లోకి కూడా ప్రవేశించింది జాగ్రత్త అంటూ సదరు నెటిజన్ పేర్కొన్నాడు. 

‘‘ఆందోళనకరం. మనిషి స్పృహలో ఉన్నప్పటికీ జాంబీ మాదిరిగా కదలకుండా మార్చే ప్రాణాంతకమైన 'జాంబీ డ్రగ్' ఇప్పుడు బెంగళూరులోకి ప్రవేశించింది. నిట్టె కాలేజీ సమీపంలోని బాగలూరులో ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు, యువత, పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఇది మన నగరానికి తీవ్రమైన హెచ్చరిక. బెంగళూరు 'ఉడ్తా బెంగళూరు'గా మారుతోంది. ఆలస్యం కాకముందే మేల్కొనండి’’ పేర్కొన్నాడు. 

►ALSO READ | చదవుకోండ్రా : ఈ పిల్లోడు బాబా అంట.. సిగరెట్లు తాగుతాడు.. ఎగబడి ఆశీర్వాదం తీసుకుంటున్న జనం..!

ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విభాగంలో, బెంగళూరులోని యలహంక పోలీస్ స్టేషన్ అధికారులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించాలని సదరు నెటిజన్‎ను కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ వీడియో నెట్టింట తెగా వైరల్ కాగా కొందరు యూజర్లు కామెంట్ల రూపంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భయానకంగా ఉంది..  అతనికి అవసరమైన సహాయం అందుతుందని ఆశిస్తున్నాను. ఇది ఒక విషవలయం. ఎవరూ ఇందులోకి వెళ్లకండని కామెంట్స్ చేస్తున్నారు. ఉన్న టెన్షన్స్ చాలక.. కొత్తగా ఇదేందయ్యా ఇది అంటూ ఇంకొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

ఏంటీ జాంబీ డ్రగ్:

అమెరికా వంటి అగ్ర దేశాల్లో ఇప్పటికే విధ్వంసం సృష్టిస్తున్న ఈ డ్రగ్‌ను నెట్టింట జాంబీ డ్రగ్ అని పిలుస్తారు. హెరాయిన్, కొకైన్ మాదిరిగా డ్రగ్స్‎లో ఇది ఒక వెరైటీ.  జైలజైన్ అనే కెమికల్‎తో ఈ డ్రగ్స్ తయారు చేస్తారు. సాధారణంగా పశువులకు మత్తు ఇవ్వడానికి ఈ కెమికల్‎ను ఉపయోగిస్తారు. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తి మెదడు పనితీరు పూర్తిగా మొద్దుబారిపోతుంది. బాధితులు స్పృహలో ఉన్నట్లు అనిపించినా వారికి వారి శరీరం నియంత్రణ ఉండదు.

 అచ్చం సినిమాల్లో చూపించే జాంబీల మాదిరిగా వింత వింత భంగిమల్లో గంటల తరబడి ఒకే చోట నిలబడిపోవడం, కూర్చువడం వంటివి చేస్తారు. ఈ జైలజైన్ కెమికల్ వాడకం వల్ల చర్మంపై కుళ్లిపోయినట్లుగా గాయాలు ఏర్పడతాయి. సకాలంలో చికిత్స అందకపోతే ఆ అవయవాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి.