చదవుకోండ్రా : ఈ పిల్లోడు బాబా అంట.. సిగరెట్లు తాగుతాడు.. ఎగబడి ఆశీర్వాదం తీసుకుంటున్న జనం..!

చదవుకోండ్రా : ఈ పిల్లోడు బాబా అంట.. సిగరెట్లు తాగుతాడు.. ఎగబడి ఆశీర్వాదం తీసుకుంటున్న జనం..!

వాడు పిల్లోడు.. వాడి వయస్సు నిండా 12 ఏళ్లు.. వీడు బాబా అంట.. ఈ పిల్ల బాబా దమ్ము మీద దమ్ము కొడతాడు.. అందరి ముందు సిగరెట్లు తాగుతాడు.. ఈ పిల్ల బాబా మహిమనే సిగరెట్లు తాగటం అంట.. వీడి దగ్గరకు తండోప తండాలుగా జనం వస్తున్నారు.. ఈ పిల్ల బాబా సిగరెట్లు తాగుతూ ఆశీర్వాదాలు ఇస్తున్నాడు.. ఇదెక్కడో కాదు.. మన గుజరాత్ రాష్ట్రంలోని నిర్వాకం. ఈ పిల్ల సిగరెట్ల బాబా కథ వింటే.. చదువుకోండ్రా.. చదువుకుని సావండ్రా అనే డైలాగ్స్ గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ ఈ పిల్ల సిగరెట్ల బాబా పూర్తి వివరాలు తెలుసుకుందామా..

గుజరాత్‌లోని మోర్బికి చెందిన  సిగరెట్ వాలే బాబా అనే మైనర్ సిగరెట్లు తాగుతున్న వీడియో వైరల్ కావడంతో  నెటిజన్లు షాక్ కు గురయ్యారు. ఈ వీడియోలో నిండా 12ఏళ్ల వయసు కూడా లేని బాలుడు బహిరంగంగా సిగరెట్లు కాలుస్తుండగా అక్కడ గుమిగూడిన జనం అతడిని చుట్టూ చేరి ప్రోత్సహిస్తున్నారు. కొందరు అతనికి మరిన్ని సిగరెట్లు ఆఫర్ చేసి, డబ్బులు కూడా విసిరారు. కొందరు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో  నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. 

ఆ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడున్న పెద్దలు ఆ పరిస్థితిని అదుపు చేయకుండా ఎలా కొనసాగనిచ్చారని చాలామంది ప్రశ్నించారు. ఆ బాలుడి ఆరోగ్యంపై ఆందోళన నుంచి, సహాయం అందించడానికి బదులుగా సున్నితమైన పరిస్థితులను చిత్రీకరించే సమాజం పెరుగుతున్న ధోరణిపై విమర్శల వరకు తీవ్రంగా విమర్శలు చేశారు. కొంతమంది యూజర్లు సిగరెట్లు తాగుతూ ఆ బాలుడి ఇబ్బంది పడుతున్నాడని ఎత్తిచూపగా.. మరికొందరు మైనర్లలో పొగతాగడం వంటివి ప్రోత్సహిస్తే జరిగే అనర్థాలు, ప్రమాదాలను హైలైట్ చేశారు.

చిన్న వయసులోనే పొగతాగడం దీర్ఘకాలిక వ్యసనంగా మారి శ్వాసకోశ వ్యాధులు ,గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని ప్రజారోగ్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో, సిగరెట్లు ,ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు పొగాకు ఉత్పత్తులను అమ్మడం నిషేందించారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం  అంటున్నారు  నెటిజన్లు.