షుగర్ ను తగ్గించేవి ఇవే

షుగర్ ను తగ్గించేవి ఇవే

టీ, కాఫీ, స్వీట్లు... ఇలా ఏదో విధంగా షుగర్​ ఉన్న ఫుడ్​ తీసుకుంటారు చాలామంది. అయితే కొందరు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంట్లో షుగర్​ లెవల్స్​ పెరుగుతుంటాయి. షుగర్​ ఎక్కువైతే ఇన్​ఫ్లమేషన్​, డయాబెటిస్, క్యాన్సర్​, ఒబెసిటి వంటి హెల్త్​ ఇష్యూస్​ వచ్చే ఛాన్స్​ ఉంది. అయితే ఉన్నపళంగా షుగర్​ ఉన్న ఫుడ్​ ఆపేస్తే అలసట, తలనొప్పి, క్రాంప్స్ వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా, స్వీట్లు తినాలనే కోరిక కలగకుండా ఉండేందుకు  కిచెన్​లో సుగంధ ద్రవ్యాలు మెడిసిన్​గా పనిచేస్తాయి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. 

షుగర్​కి ఆల్టర్నేట్​గా యాలకుల్ని తినాలి. కమ్మని వాసన, రుచి ఉన్న ఇవి  స్వీట్లు తినాలనే కోరిక రానీయవు.  ఫ్రీరాడికల్స్ ఇన్సులిన్​ని విడుదల చేసే కణాల్ని డ్యామేజ్​ చేస్తుంటాయి. ఫ్రీరాడికల్స్​​ని బయటకి పంపించి, ఇన్సులిన్​ రిలీజ్​ని పెంచడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది.  నల్ల మిరియాల్లో పైపెరిన్​ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్​ గుణాలు ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి.   పసుపులోని కర్​క్యుమిన్​ అనే ఆల్కలాయిడ్​ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తుంది. అంతేకాదు జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది.  లవంగాలు ఇన్సులిన్​ సెన్సిటివిటీని పెంచుతాయి.  రక్తంలో షుగర్​ లెవల్స్​ తగ్గడంలో సాయపడతాయి. యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలున్న దాల్చినచెక్క ఇన్సులిన్​ సిగ్నలింగ్​ని ఇంప్రూవ్​ చేస్తుంది.