ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని ఉందా..? రూ. 1800లకే పుణ్యక్షేత్రాల సందర్శన

ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని ఉందా..? రూ. 1800లకే పుణ్యక్షేత్రాల సందర్శన
  • జోగులాంబ, బనగానపల్లె, యాగంటి, మహానందికి స్పెషల్​ ప్యాకేజీ  
  • కుషాయిగూడ డిపో నుంచి మార్చి 6న యాత్ర

హైదరాబాద్ సిటీ, వెలుగు: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం కుషాయిగూడ డిపో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. జోగులాంబ, బనగానపల్లె, యాగంటి, మహానంది క్షేత్రాలను సందర్శించేందుకు మార్చి 6న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరనున్నది. ఈ పుణ్యక్షేత్రాల యాత్రకు టికెట్ ధర రూ.1,800గా నిర్ణయించారు. టికెట్ బుకింగ్ కోసం 9603549388, 7382819873 నంబర్లను సంప్రదించాలన్నారు.

పండరీపూర్​, తుల్జాపూర్​లకు...
మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు కూడా కుషాయిగూడ డిపో నుంచి ప్రత్యేక బస్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. డిపో నుంచి మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి, పండరీపూర్ రుక్మిణి పాండురంగ, కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ భవానీ మాతా ఆలయాలకు వెళ్లేందుకు మార్చి 6న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరనున్నది. టికెట్ ధర రూ.3,500 నిర్ణయించారు.  బుకింగ్ కోసం 9603549388, 7382819873 సంప్రదించాలన్నారు.