భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. నెల రోజులకుగాను రూ.1,56,91,971 నగదు, 71 గ్రాముల బంగారం, కిలో 280 గ్రాముల వెండితో పాటు 34 యూఎస్ డాలర్లు, ఒక కెనడా డాలర్, 196 మలేషియా రింగిట్స్, 100 యూఏఈ దీరామ్స్, 27 సింగపూర్ డాలర్లు, 80 ఇంగ్లాండ్ స్టిర్లింగ్స్, 50 సౌదీ అరేబియా రియాల్స్, 50 ఆస్ట్రేలియా డాలర్లు వచ్చాయని ఈవో దామోదర్‌రావు తెలిపారు. చిత్రకూట మండపంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది.

