V6 News

నిత్య కల్యాణాలు షురూ

నిత్య కల్యాణాలు షురూ

భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో శనివారం నుంచి నిత్య కల్యాణాలు ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల కారణంగా ఈ నెల 8 నుంచి 12 వరకు నిత్య కల్యాణాలు నిలిపేశారు. ఉదయం భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. బాలభోగం నివేదించాక బంగారు తులసీదళాలతో అర్చన చేశారు. ఆ తర్వాత కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు. 

నిలకడగా గోదావరి ఉధృతి
భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా 50 అడుగుల వద్ద నిలకడగా ఉంది. శనివారం సాయంత్రం 3 గంటల వరకు 50.90 అడుగులకు తగ్గింది. దిగువన పోలవరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్​తో పాటు, శబరి నది ఉధృతితో ఈ పరిస్థితి నెలకొంది. ఛత్తీస్​గఢ్, ఒడిశాలకు రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు.  

దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర

తల్లాడ, వెలుగు: దేశ సమైక్యత, స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్  వరకు భారత్  జోడోయాత్ర చేపడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆజాదీ కా గౌరవ్ యాత్ర 5వ రోజు శనివారం మండలంలోని వెంకటగిరి క్రాస్ రోడ్  నుంచి ప్రారంభించారు. అంజనాపురం, మిట్టపల్లి, పాయపుర్  మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేపట్టనున్న భారత్ జోడో యాత్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాపా సుధాకర్, రఘుపతి రెడ్డి, కటికి కిరణ్, కృష్ణారావు పాల్గొన్నారు.

పోటీతత్వం పెరగాలి

సత్తుపల్లి, వెలుగు:విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని మదర్ థెరిసా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ అన్నారు. ఆజాదీకా అమృత్​ మహోత్సవంలో భాగంగా శనివారం కాలేజ్​ ఎన్ఎస్ఎస్  విభాగం ఆధ్వర్యంలో వ్యాసరచన, డిబేట్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఇంజనీరింగ్ డీన్ జాకీర్ హుస్సేన్, ఎన్ఎస్ఎస్  ప్రోగ్రాం ఆఫీసర్​ రామకృష్ణారెడ్డి 
తదితరులు పాల్గొన్నారు.
 

కరాటే లో గోల్డ్​ మెడల్
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలోని రెజోనెన్స్ స్కూల్  స్టూడెంట్ మహ్మద్​ ఆఫ్రిద్ ఫర్ హాన్  వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన నేషనల్ లెవెల్ షాటోకాన్‌‌ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలో గోల్డ్​ మెడల్​ సాధించడం అభినందనీయమని స్కూల్ డైరెక్టర్స్ కె.శ్రీధర్ రావు, కృష్ణవేణి, ప్రిన్సిపాల్ ఎం.ప్రసన్నారావు తెలిపారు. స్టూడెంట్ ను అభినందించారు. 


కిట్స్ కాలేజ్ లో సెలబ్రేషన్స్
ఖమ్మం టౌన్, వెలుగు: సిటీలోని కిట్స్ కాలేజీలో ఎంబీఏ స్టూడెంట్స్ ఫేర్‌‌వెల్‌‌ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కృష్ణమూర్తి, క్రీడాయ్  వైస్  ప్రెసిడెంట్  వి.నగేశ్‌‌, కాలేజీ సెక్రటరీ కోట అప్పిరెడ్డి,హెచ్ వోడీ వి.దేవేందర్ పాల్గొన్నారు.


ఎంసెట్​లో గురుకుల స్టూడెంట్‌‌కు ర్యాంక్
ఇల్లందు, వెలుగు: మండలంలోని సుదిమళ్ల గిరిజన గురుకుల కాలేజీ విద్యార్థిని చింతా శ్రేయ ఎంసెట్ లో 8550 సాధించినట్లు ప్రిన్సిపాల్ అరుణ కుమారి తెలిపారు. గుండాల మండలం ఆళ్లపల్లి  గ్రామానికి చెందిన ఆమె మంచి ర్యాంక్ సాధించడం అభినందనీయమని అన్నారు.